తెలంగాణ

ఇంటర్ బోర్డు అధికారులపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: శ్రీవాసవి కాలేజీలో చదువుతూ హాల్ టిక్కెట్లు రాక పోవడంతో పరీక్షలకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇటు ప్రభుత్వంతోనూ, అటు కాలేజీ యాజమాన్యంతోనూ వారు పోరు సల్పుతున్నారు. హాల్‌టిక్కెట్ల వివాదంతో ఇంటర్మీడియట్ బోర్డు అవినీతి కూడా బట్టబయలు కావడంతో ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విద్యాశాఖా మంత్రి కడియం శ్రీహరి ఆదేశాలతో ఇంటర్ బోర్డు అధికారులు కాలేజీ యాజమాన్యంపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇంటర్ బోర్డు తీరుపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో పక్క విద్యార్థులు ఇటు కాలేజీ యాజమాన్యంపైనా, ఇంటర్ బోర్డుపైనా ఫిర్యాదు చేశారు. నిజాలు నిగ్గుతేల్చాలని, తమ భవిష్యత్ కాపాడాలని విద్యార్థులు , వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. అమరజ్యోతి అనే విద్యార్థిని వనస్థలిపురం పోలీసులకు శ్రీవాసవి కాలేజీ యాజమాన్యంపైనా, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులపైనా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐపిసి 420, 406 కింద కేసులు నమోదు చేశారు. వాసవి కాలేజీ యాజమాన్యం తరచూ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోందని, విద్యార్థుల జీవితాలతో కాలేజీ యాజమాన్యం చెలగాటం ఆడుతోందని బోర్డు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి నివేదికను కోరింది. ఈ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని బోర్డు అధికారి చెప్పారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ముందే కాలేజీపై చర్యలు తీసుకోవాలా లేక అడ్వాన్స్ సప్లిమెంటరీ తర్వాత చర్యలు చేపట్టాలా అనే మీమాంసలో అధికారులున్నట్టు తెలిసింది.
గత మూడు రోజులుగా క్రిమినల్ కేసులు నమోదుచేస్తున్నట్టు బోర్డు అధికారులు చెప్పినా, గురువారం రాత్రి వరకూ కాలేజీ యాజమాన్యంపై పోలీసులకు ఇంత వరకూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది.
ఇరువర్గాల్లో తప్పు
కాలేజీ యాజమాన్యం తప్పు చేసినందేనిది చాలా స్పష్టంగా కనిపిస్తోందని, ఆ కాలేజీ తీరుపై ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోకపోవడంలో బోర్డు వైఫల్యం కూడా కనిపిస్తోందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మధుసూధనరెడ్డి పేర్కొన్నారు. ఈపాటికే కాలేజీ యజమానిపై క్రిమినల్ కేసు పెట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఏడాది కాలంగా వివాదం నడుస్తున్నపుడు విద్యార్ధులను వేరే కాలేజీ ద్వారా పరీక్షలకు అనుమతించి ఉంటే సరిపోయేదని , జనవరిలో కంపల్సరీ పేపర్లు పరీక్షలు పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 17న ఆన్‌లైన్‌లో విద్యార్ధుల అప్లికేషన్లను అప్‌లోడ్ చేసేందుకు అనుమతించడంలోనే బోర్డు తప్పిదం కనిపిస్తోందని ఆయన విశే్లషించారు. ఇంత వరకూ కాలేజీ షిఫ్టింగ్‌కు అనుమతి లేదని, అనుబంధ గుర్తింపుపై కూడా స్పష్టత లేదని అన్నారు.
ఐదుగురిపై మాల్ ప్రాక్టీస్ కేసులు
గురువారం నాడు జరిగిన సెకండియర్ తొలి పరీక్షకు 3,91,313 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేయగా, 3,73,916 మంది మాత్రమే హాజరయ్యారు. ఐదుగురు విద్యార్ధులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్టు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.