తెలంగాణ

తక్కువ ఖర్చుతో మానవ సహిత ఉపగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ తక్కువ ఖర్చుతో, అత్యంత అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో మానవ సహిత ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు కృషి చేయాలని, ఈ శక్తి మన దేశానికి ఉందని ఇస్రో పూర్వ చైర్మన్ కస్తూరి రంగన్ తెలిపారు. ఈ తరహా ప్రోగ్రాంను అమలు చేసేందుకు అవసరమైన వ్యూహాలను అంతరిక్ష సంస్ధ ఖరారు చేసుకోవాలన్నారు. అంతరిక్ష శాస్తవ్రేత్తలు సమష్టిగా తన మేధాశక్తిని ఉపయోగించి మానవసహిత ఉపగ్రహాన్ని పంపాలన్నారు. తక్కువ పెట్టుబడితోనే ఈ ప్రయోగం చేయాలని ఆయన అన్నారు. కేవలం నిధులే కాదు, మానవ వనరులు కూడా ముఖ్యం. దీనికి వౌలిక సదుపాయాల కల్పన అవసరం. అవసరమైతే సంయుక్త రంగంలో చేపట్టాలి అని ఆయన అన్నారు. ప్రపంచ అంతరిక్ష పరిజ్ఞానాన్ని భారతీయ శాస్తవ్రేత్తలు పుణికిపుచ్చుకున్నారన్నారు. అంతరిక్ష పరిజ్ఞానం ఉన్న దేశాలతో మన దేశ అధికార రాజకీయ నేతలకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. అందుకే ఇక ఏ మాత్రం జాప్యం లేకుండా మానవ సహిత ఉపగ్రహ డిజైన్‌ను రూపొందించాలన్నారు. మన దేశం ఆర్ధికంగా మంచి అభివృద్ధిని సాధిస్తోందని, అంతరిక్షంలో రోదసి క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకునే శక్తి కూడా ఉందన్నారు. భారత అంతరిక్ష ప్రయోగాలకు ప్రజల మద్దతు ఉందన్నారు.