తెలంగాణ

వడగాడ్పుల వార్నింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: వచ్చే వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని వడగాడ్పుల తీవ్రత విషయమై ప్రజలకు తెలియచేసేందుకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజిమెంట్ వినూత్న ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ దాటితే వేడిగాలులు ఉన్నట్లు గుర్తిస్తారు. 45 డిగ్రీల సెల్సియస్ దాటితే తీవ్రమైన వేడిగాలులపై హెచ్చరికలు జారీ చేయాల్సి ఉంటుంది. నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రామగుండం, గోదావరి ఖని, భద్రాచలం, కొత్తగూడెంలో వేడిగాలుల తీవ్రతపై హెచ్చరికలు జారీ చేసేవారు. ఇక్కడ వేసవికాలం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే నమోదవుతుంటాయి. ఈ సారి ఐటి శాఖ, రెవెన్యూ శాఖ సహాయంతో వడగాడ్పుల హెచ్చరికలను వీటి ప్రభావం ఉన్న ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాల ద్వారా అందిస్తారు.
ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 సెల్సియస్ డిగ్రీలు ఉంటే ఆకుపచ్చ సంకేతం, 46 దాటితే మాత్రం ఎరుపు సంకేతం పంపనున్నారు. తీవ్రమైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల ప్రజలకే ఈ సందేశాలు పంపుతారు. రాష్ట్రంలో రానున్న వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళికను డిజాస్టర్ మేనేజిమెంట్ శాఖ రూపొందిస్తున్నారు. 2016లో 42 రోజులు, 2015లో 35 రోజుల పాటు వడగాడ్పుల తీవ్రత నెలకొంది.
2010లో గరిష్టంగా 46 రోజులు, 2013లో 43 రోజులు వేడిగాలులు వీచాయి. రాష్ట్రంలో వడగాడ్పుల వల్ల 2010లో 11 మంది, 2012లో 144 మంది, 2013లో 516 మంది, 2014లో 31 మంది, 2015లో 541 మంది, 2016లో 324 మంది మరణించారు.