తెలంగాణ

వరంగల్‌లో పాస్‌పోర్టు కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: వరంగల్‌లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుస్మా స్వరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టిఆర్‌ఎస్ ఎంపి కవితకు సుస్మా స్వరాజ్ లేఖ రాశారు. వరంగల్‌లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కవిత ఇటీవల కేంద్ర మంత్రి సుస్మా స్వరాజ్‌ను కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి సుస్మా స్వరాజ్ స్పందించి నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ఫోస్ట్ఫాసులో పాస్‌పోర్టు సేవా కేంద్రం పని చేస్తుంది. ఎంపి కవిత లేఖ వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా తపాలా శాఖతో కలిసి పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. వీటిని పోస్ట్ఫాసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా పిలుస్తారు.