తెలంగాణ

నువ్వెంత..నీ బతుకెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/పరిగి, మార్చి 2: ఓ ఎమ్మెల్యే ఓబడుగు ఉద్యోగినిపై ‘‘నేడు ఎమ్మెల్యేరేపు మంత్రిని.. ఆ తరువాత ముఖ్యమంత్రిని అవుతా. నా ఇంటికే కరంట్ కట్ చేస్తావా’’ అంటూ చిందులేశారు. బిల్లును అడిగేందుకు మాత్రమే వచ్చానంటూ లైన్ మెన్ చెబుతున్న సమాధానాన్ని కూడా జీర్ణించుకోలేని సదరు ప్రజాప్రతినిధి పత్రికల్లో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ తిట్ల పురాణం పెట్టాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి పరిగిలో చోటు చేసుకోగా సదరు ప్రజాప్రతినిధి, లైన్‌మెన్ల మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేసిన వాయిస్ రికార్డును సోషల్ మీడియాలో పొందుపర్చడంతో గురువారం ఉదయం నుండి హల్‌చల్ చేసింది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఇంటి కరెంట్‌కు సంబంధించి బిల్లు వసూలు కోసం ఆ ఇంటికి వెళ్లిన లైన్‌మెన్ రమేష్‌కు ఎమ్మెల్యే పిఎ అశోక్‌రెడ్డి మధ్య జరిగిన వాగ్వివివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఈ సంఘటనకు సంబంధించి అశోక్‌రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించాడంటూ లైన్‌మెన్ తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు జరిగిన విషయాన్ని ఎమ్మెల్యేకు వివరించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అంతలోనే ఎమ్మెల్యే లైన్‌మెన్‌కు ఫోన్ చేసి తనదైన శైలిలో మందలించిన ఆడియో రికార్డును సోషల్ మీడియాలో విన్న ప్రతి ఒక్కరు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఓ ఉద్యోగిపై వ్యవహరించిన తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వ్యవహరించాల్సిన ఓ ప్రజాప్రతినిధి సొంత ఇంటి విషయంలో ఇంత వివాధానికి తెర లేపడం ఎంత వరకు సమంజసమని నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే పిఏ అశోక్‌రెడ్డి చేత అవమానానికి గురై ఎమ్మెల్యే మాట్లాడిన తీరుకు మనస్థాపానికి గురైన లైన్‌మెన్ పరిస్థితిని గమనించిన విద్యుత్ శాఖ అధికారులు ఘటనపై ఆరా తీశారు. బాధిత లైన్‌మెన్, ఎస్‌ఐ నాగేష్‌ల కధనం మేరకు పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి ఇంటికి కరెంట్ బిల్లు బకాయి ఆరువేల రుపాయలు చెల్లించాలని పిఎ అశోక్‌రెడ్డిని లైన్‌మెన్ రమేష్ కోరారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల ముందు కరెంట్ బిల్లు అడిగి పరువు తీస్తున్నావంటూ లైన్‌మెన్ రమేష్‌పై పిఏ ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్‌మెన్, పిఎల మధ్య తీవ్ర వాగ్వివివాదం జరిగింది. లైన్‌మెన్ పరిగి ఏఇ రాంచంద్రయ్య, ఏడి మోహన్‌కు ఫోన్ చేసి గొడవ జరుగుతున్న విషయం చెప్పాడు. పవర్ కట్ చేయమని ఏఇ చెప్పడంతో ఎమ్మెల్యే ఇంటికి పవర్ కట్ చేశాడు. పది నిమిషాలలోనే మళ్లీ పవర్ కనెక్షన్ ఇచ్చాడు. ఇది గమనిస్తున్న పిఏ అశోక్‌రెడ్డి.. లైన్‌మెన్ రమేశ్‌ను పిలిచి చేయి చేసుకున్నాడు. జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. విద్యుత్ లైన్‌మెన్‌కు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎ అశోక్ రెడ్డి చేతిలో దెబ్బలు తిన్న లైన్‌మెన్ రమేష్.. పరిగి ఏఇ రాంచంద్రయ్య, ఏడి మోహన్‌తో కలిసి బుధవారం రాత్రి పది గంటల సమయంలో పరిగి పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే పిఎ అశోక్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు రాత్రి పదిన్నర గంటలకు ఎమ్మెల్యే పిఏ అశోక్‌రెడ్డిపై ఐపిసి 353, 323, 504 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. అర గంటలోనే విద్యుత్ అధికారులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కేసును వాపస్ తీసుకుంటామని చెప్పగా, కేసు నమోదయిందని ఏమి చేయలేమని కోర్టులోనే తేల్చుకోవాలని ఎస్‌ఐ నాగేష్ సూచించారు. కాగా,
లైన్‌మెన్ రమేశ్‌ని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి దుర్భాషలాడిన ఘటనకు సంబంధించి ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంపై లైన్‌మెన్ రమేశ్‌ను వివరణ కోరగా దాని గురించి వదిలేయమని మాట దాటవేశాడు. ఎమ్మెల్యే ఇంటికి కరంట్ కట్ చేసిన పది నిమిషాల్లోనే మళ్లీ ఎందుకు కరంట్ సరఫరా చేశారంటూ అడిగిన ప్రశ్నకు తాము కరంట్ కట్ చేయలేదంటూ సమాధానం ఇచ్చారు.