తెలంగాణ

బంగారు తెలంగాణ వట్టి భ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, మార్చి 2: ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాలం చెల్లిందని, అబద్దాలతో ఎంతోకాలం మనలేరని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజ లు కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘జన ఆవేదన’ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభనుద్దేశించి పొన్నాల మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన అంశంగా సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్కదాన్ని కూడా కెసిఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. నోరు విప్పితే అబద్దాలు మాట్లాడే కెసిఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయి కాం గ్రెస్‌వైపు ఆసక్తిగా చూస్తున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను కొల్లగొట్టి తమ ప్రాంతాన్ని తెలంగాణేతర పాలకులు అన్యాయం చేస్తున్నారన్న కెసిఆర్‌అడ్డగోలుగా అప్పులుచేసి మిగులు బడ్జెట్‌తో ఉన్న స్వరాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచేశారని ఆరోపించారు. ప్రజలు, ఉద్యోగులు, యువత, విద్యార్థులందరి పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందన్నారు. నీళ్లు సాధించి బీళ్లను సస్యశ్యామలం చేస్తామని చెబుతూ కాంగ్రెస్ ప్రాజెక్టులకే రీడిజైనింగ్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.