తెలంగాణ

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: నిరుద్యోగ యువత జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ విమర్శించారు. ఉద్యోగ ప్రకటనల జారీలో డ్రామాలాడుతూ నిరుద్యోగుల భవిష్యత్తు, జీవన పరిస్థితులను అస్తవ్యవస్థం చేస్తోందని అన్నారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల లక్షలాది మంది మానసిక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గ మండలి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నోటిఫికేషన్ల డ్రామా ఆడుతోందని అన్నారు. గురుకుల, రెగ్యులర్ ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం 7306 బోధన, భోధనేతర సిబ్బందిని భర్తీ చేసే నోటిఫికేషన్ గురువారం ఉపసంహరించుకోవడం వల్ల నిరుద్యోగుల్లో ఆవేదన పెరిగిందని అన్నారు. 60 శాతం అర్హత మార్కులు కలిగి ఉండాలనే నిబంధనను విధించడం వల్ల నిరసన తీవ్ర స్థాయిలో వ్యక్తమైందని అన్నారు. వీటన్నింటికి కారణం పరిపాలన దక్షత లేకపోవడం, అవగాహన లోపించడమేనని విమర్శించారు. అలాగే రేస్‌కోర్సు, చంచల్‌గూడ జైలు భూములను విద్యాసంస్థలకు ఇచ్చేందుకు సేకరణ ఎంత వరకు వచ్చిందని అన్నారు.