తెలంగాణ

అమ్మో! 50 వేల న్యూక్లియర్ బాంబులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ఒకటా, రెండా అమ్మో ప్రపంచ దేశాల్లో ఏకంగా 50 వేల న్యూక్లియర్ బాంబులు ఉన్నాయట. వీటిలో ఏ 500 పేలినా, వాడినా మొత్తం భూ ప్రపంచంపై మానవులే కాదు పశు-పక్ష్యాదులు, చెట్లు, చీమ సర్వనాశనం అయిపోతుందని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రపంచ దేశాలు న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకోవడం క్షేమకరం కాదని అన్నారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు ఎదురవుతున్న సవాళ్ళు అనే అంశంపై శుక్రవారం ‘్ఫ్యటప్సీ’ (ఎఫ్‌టిఎపిసిసిఐ)లో ఏర్పాటు చేసిన సదస్సులో ప్రొఫెసర్ పురషోత్తం రెడ్డి ప్రధానోపన్యాసం చేశారు. 1992 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ సదస్సులో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెరిగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోలార్ విద్యుత్తును ప్రోత్సహించడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రియో అంతర్జాతీయ సదస్సులో నాటి ప్రధాని పివి నరసింహారావు ప్రసంగం వివిధ దేశాల ప్రతినిధులను ఆకర్షించిందని అన్నారు. కాలుష్యానికి ఎవరు పాల్పడినా కోర్టులో కేసు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. పటాన్‌చెరు ప్రాంతంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న 40 పరిశ్రమలను సుప్రీంకోర్టు మూసి వేయించిందని అన్నారు. ‘్ఫ్యటప్సీ’ పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు జి. శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ టిఎస్ అప్పారావు తదితరులు ప్రసంగిస్తూ పెరుగుతున్న కాలుష్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాఉండగా సహజ వనరులను సంరక్షిద్దాం.. అని సదస్సుకు హాజరైన ప్రతినిధులతో ప్రతిజ్ఞ చేయించారు.