తెలంగాణ

తాండూరు బల్దియా పీఠం కాంగ్రెస్ వశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మార్చి 4: తాండూరు మున్సిపాలిటీలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల ప్రక్రియ ఎట్టకేలకు శనివారం ముగియడంతోగత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న అయోమయ, గందరగోళ పరిస్థితులకు తెరదించినట్టయింది.
ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకోగా, ఆ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మజ్లిస్ పార్టీ తీవ్ర నిరాశలో మునిగింది. శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ మీటింగ్ హాల్ నందు నిర్వహించిన చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల అధికారి, తాండూరు సబ్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ప్రశాంతంగా పూర్తి చేశారు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చైర్‌పర్సన్ ఎన్నికలలో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా హాజరయ్యారు. ఎన్నికల అధికారి చైర్‌పర్సన్ ఎన్నికలకు కౌన్సిల్ సభ్యలనుండి చేతులు ఎత్తేవిధానం ద్వారా ఎన్నికను చేపట్టగా, కాంగ్రెస్ అభ్యర్థి బి.సునీతా సంపత్‌కు మద్దతుగా కౌన్సిల్ మొత్తం సభ్యులు 31 మందిలో 17 మంది చేతులు ఎత్తారు. ఎంఐఎం అభ్యర్థిని మహ్మాదీబేగంకు 14 మంది సభ్యులు చేతులు ఎత్తారు. కాగా ఎక్స్ అఫిషియో మెంబర్‌గా ఎన్నికలలో పాల్గొన్న మంత్రి ఓటుతో మహ్మదీ బేగంకు 15 ఓట్లు లభించినట్టు ఎన్నికల అధికారి వెల్లడించారు. కాగా తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థి బి.సునీతా సంపత్ చైర్‌పర్సన్‌గా విజయం సాధించినట్టు ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ప్రకటించారు. అనంతరం వైస్‌చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో పాల్గొనకుండా అధికార టిఆర్‌ఎస్ సభ్యులు 10 మంది, ఎంఐఎం పార్టీకి చెందిన నలుగురు ఎన్నికల ప్రక్రియ నుండి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. దాంతో చైర్‌పర్సన్ ఎన్నికలో పాల్గొన్న కౌన్సిల్ సభ్యులతో కోరం ఉన్నందున వైస్‌చైర్మన్ బరిలో ఉన్న ఎంఐఎం పార్టీ అభ్యర్థి సయ్యద్ ఆసిఫ్ హుస్సేన్‌ను ఎన్నికల అధికారి వైస్‌చైర్మన్‌గా ప్రకటించారు. దాంతో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కాగా ఎట్టి పరిస్థితుల్లో చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న ఎంఐఎం ఆశలు కల్లలు కాగానే ఆపార్టీ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీకి చైర్మన్ పీఠం దక్కకుండా చేజారిపోవడానికి ఆ పార్టీకి చెందిన నాయకులు, పార్టీ కౌన్సిలర్‌లే కారణం అని తెలియగానే ఆపార్టీ శ్రేణులతో పాటు, కొందరు మజ్లిస్ పార్టీ అభిమానులు తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ, పట్టణంలోని మజ్లిస్ పార్టీ కార్యాలయం వైపు పరుగులు తీశారు. మరి కొందరు ఆ పార్టీ వర్గాలు మున్సిపల్ కార్యాలయం ముందే తమ నిరసనలు వ్యక్తం చేసేందుకు యత్నించగా పోలీసులు వారించి తరిమి వేశారు.

చిత్రాలు.. చైర్‌పర్సన్ సునీత, వైస్ చైర్మన్ ఆసిఫ్