తెలంగాణ

తెలుగు, ఉర్దూలోనూ అసెంబ్లీ వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ అసెంబ్లీకి కొత్త వనె్న రాబోతున్నది. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలుకుని ఇప్పటి వరకు అసెంబ్లీ వెబ్‌సైట్ కేవలం ఇంగ్లీషులోనే ఉన్నది. తాజాగా శాసనమండలి కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్ తెలుగు, ఉర్దూలోనూ వెబ్‌సైట్ ప్రారంభించాలన్న ఆలోచన చేశారు. దీంతో రీసెర్చ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి ప్రభృతులతో కలిసి ఆయన దీనిని సంపూర్ణం చేశారు. ఉర్దూ, తెలుగు వెబ్‌సైట్‌ను ఈ నెల 6న (సోమవారం) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో కౌన్సిల్ చైర్మన్ కె. స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి, రాష్ట్ర నీటి పారుదల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఈ వెబ్‌సైట్ ప్రారంభంతో మూడు భాషల్లో వెబ్‌సైట్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. పార్లమెంటుకు ఇంగ్లీషు, హిందీ ఉన్నప్పటికీ, ఇంగ్లీషు ఒక్కటే నిర్విఘ్నంగా నిర్వహించగలుగుతున్నది. ముస్లింల ఆధిపత్యం ఉన్న జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోనూ ఉర్దూ వెబ్‌సైట్ లేదు. కేవలం ఇంగ్లీషు మాత్రమే ఉంది. ఏ రాష్ట్రంలోనూ రెండు భాషల్లో వెబ్‌సైట్‌లు లేవు. కానీ తెలంగాణ కౌన్సిల్, అసెంబ్లీ మూడు భాషల్లో వెబ్‌సైట్ రూపుదిద్దుకున్నది.