తెలంగాణ

ఉనికి కోసమే కాంగ్రెస్ ఆరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణలో ఉనికి చాటుకోవడానికి కాంగ్రెస్ తంటాలు పడుతోందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, గంగాధర్‌గౌడ్, ఫారుఖ్ హుస్సేన్ విమర్శించారు. యాత్రలు చేసినట్టుగా దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వచ్చి ఏదో మాట్లాడి వెళుతున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని దిగ్విజయ్‌సింగ్ ఈ విషయం తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. మధ్యప్రదేశ్‌లో పదేళ్ల దిగ్విజయ్ సింగ్ పాలన వల్ల పదిహేనేళ్ల నుంచి బిజెపినే అధికారంలో ఉంటోందని ఎద్దేవా చేశారు. నెహ్రూ కుటుంబం గాంధీ పేరు తగిలించుకుని తరతరాలుగా అధికారం చెలాయిస్తోందని, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సంజయ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల చేతిలో కాంగ్రెస్ ఉందని, ఆ పార్టీ నాయకులు కుటుంబ పాలన అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. దిగ్విజయ్‌సింగ్ లాంటి వారి వల్లనే కాంగ్రెస్ పార్టీ దేశంలో నానాటికి బలహీన పడుతోందని అన్నారు. ఒకవైపు ప్రాజెక్టులు కట్టకుండా కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తూ మరోవైపు విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని గంగాధర్‌గౌడ్ విమర్శించారు.