తెలంగాణ

జోనల్ వ్యవస్థ రద్దు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను రద్దు చేసి రాష్టమ్రంతా ఒకే జోన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోంది. జోనల్ వ్యవస్థ వల్ల తలెత్తే పరిణామాలు, రాష్ట్రంలో నిరుద్యోగులకు కలిగే ప్రయోజనాలు, అలాగే నష్టం వాటిల్లుతుందన్న వర్గాల వారి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఒక ముసాయిదా ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ కార్యదర్శి ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలకు ముందే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ముసాయిదా పత్రాన్ని రూపొందించనున్నట్లు తెలిసింది.
గత ఏడాది జోనల్ వ్యవస్థను రద్దు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉందని ప్రభుత్వం పేర్కొన్న విషయం విదితమే. కాని ఈ ప్రతిపాదనకు వివిధ సంఘాల నుంచి సానుకూలత, వ్యతిరేకత వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ జోనల్ విధానం ఉండాలని డిమాండ్ చేస్తోంది. అవసరమైతే ముసాయిదా ప్రతిపాదనలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరు జోన్లు ఉండగా, ఇందులో రెండు జోన్లు తెలంగాణలో ఉన్నాయి. ఐదవ జోన్‌లో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు, ఆరవ జోన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పది జిల్లాలను పునర్విభజించి కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారు.
దీని వల్ల జోన్ల విధానంలో కొంత గందరగోళం ఏర్పడింది. అలాగే ఐదవ జోన్ జిల్లాల్లోకి, ఆరవ జోన్ జిల్లాల గ్రామాలు, ఆరవ జోన్‌లోకి ఐదవ జోన్‌లోని జిల్లాల గ్రామాలు మండలాలు చేరాయి. దీని వల్ల జిల్లా స్థాయి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే తమకు అన్యాయం జరుగుతుందంటూ ఉద్యోగార్థులు కోర్టులో సవాలు చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 పోస్టుల నియామకానికి వచ్చిన సమస్య ఏమీ ఉండదు. కాని జోనల్ వారీ రిక్రూట్‌మెంట్ విధానం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పాత జిల్లాలను పరిగణనలోకి నోటిఫికేషన్ ఇస్తే వివాదాలు ఉండవు. కాని కొత్త జిల్లాల ప్రాతిపదికన జోనల్ వారీ ఉద్యోగాలు, జిల్లా స్థాయి ఉద్యోగాల భర్తీకే సమస్యలు ఎదురవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆంధ్ర రాజధాని అమరావతికి తరలివచ్చే వారి కోసం రాష్టప్రతి ఉత్తర్వులను సవరించారు.
అలాగే అమరావతిని ఫ్రీ జోన్ చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ రెండు అంశాల ప్రాతిపదికగా రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ వ్యవస్థ రద్దుకు రాష్టప్రతి ఉత్తర్వుల సవరణ అవసరమా లేక మొత్తం జోనల్ వ్యవస్థ రద్దుకు వెళ్లాలా అనే విషయమై ఉన్నతాధికారుల కమిటీ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే ప్రభుత్వం ఈ అంశంపై వచ్చే అసెంబ్లీ చర్చల్లో చర్చించనున్నట్లు తెలిసింది. 371 డి రద్దు చేస్తే తప్ప జోనల్ విధానం రద్దు కాదనే వాదనలు ఉన్నాయి. ఈ అంశాలపై న్యాయ నిపుణుల సేవలు కూడా తీసుకోవాలని, మొత్తం ఈ అంశాలపై సమగ్ర నివేదికను ఉన్నతాధికారుల బృందం ప్రభుత్వానికి ఇవ్వనుంది. తెలంగాణ జాక్ కూడా జోనల్ విధానం రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.