తెలంగాణ

వేములవాడకు రూ.400కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: సుప్రసిద్ధ వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధికి రూ.400 కోట్లతో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆలయానికి రెండో ప్రాకారం, ఇతర నిర్మాణాలు ఆగమ, వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మించనున్నారు. ఈ నిర్మాణాల డిజైన్లను కర్నాటకలోని శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామికి అధికారులు చూపించారు. దేవాదాయ శాఖ కమీషనర్ శివశంకర్, వేములవాడ టెంపుల్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ యం. పురుషోత్తమ్‌రెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి దూస రాజేశ్వర్, స్తపతి వల్లినాయగంల బృందం కర్ణాటక వెళ్లి ఆలయ అభివృద్ధి బృహత్ ప్రణాళికను వివరించారు. అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన భారతీ తీర్థ స్వామి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. తెలంగాణ ఆభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషి అభినందనీయం అని భారతీ తీర్థ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్, జిల్లా మంత్రి కెటిఆర్, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబులకు ఆశీస్సులు అందజేశారు. ఆలయ కార్యనిర్వాహక ఇంజనీరు ఇ.రాజయ్య, డిఇఇ యం రఘునందన్ , ఆర్కిటెక్ట్ నాగరాజు, ముక్తేశ్వర్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇంతకు ముందే జివో విడుదల చేసింది.