తెలంగాణ

బడ్జెట్ సమరానికి రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: మార్చి 10 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అధికార పక్షంతో పాటు విపక్షాలు పూర్తిగా సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి గడచిన 30నెలల్లో ఇప్పటి వరకు అధికార పక్షాన్ని పెద్దగా ఇరకాటంలో పెట్టే అంశాలు విపక్షాలకు చిక్కలేదు. విద్యుత్ సమస్య లేకపోవడం, వర్షాలు బాగుండడం ప్రభుత్వానికి ప్రధానంగా కలిసి వచ్చిన అంశాలు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే ఇరిగేషన్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తుందో వివరించేందుకు అధికార పక్షం సమావేశాలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆయా శాఖల్లో అభివృద్ధిపై మంత్రులు పూర్తి సమాచారంతో ఉండాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. మరో పక్క విపక్షాలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం అమలులో నత్తనడక అంశాన్ని, ఉద్యోగాల నియామకాలు, దళితులకు మూడెకరాల భూమి వంటి అంశాలను సభలో ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించుకున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా పోతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అయితే ఇవే అంశాలపై విపక్షాలను ఎండగట్టాలని అధికార పక్షం చూస్తోంది. భూ సేకరణతో పాటు ప్రాజెక్టులకు సంబంధించి వివిధ అంశాలపై 34 కేసులు వేశారు. వీటిలో పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రత్యక్షంగా ఉండడంపై సభలోనే చెప్పాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో కాంగ్రెస్ నేత హర్షవర్థన్ రెడ్డి కేసు వేశారు. భూ సేకరణపై కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల అనుచరులు కేసులు వేశారు. వీటికి సంబంధించి వివరాలు అన్ని సేకరించారు. శాసన సభలో వీటిన్నింటి గురించి వివరంగా చెప్పాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అదే విధంగా ఉద్యోగ నియామకాలపై జెఎసి ఆందోళనకు దిగినా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. రెండున్నర ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ నియామకాలు జరిగాయి, తెలంగాణలో ఎన్ని జరిగాయి, ఇతర రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో వివరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
మిగిలిన అంశాల్లో విపక్షాలకు పెద్దగా వాయిస్ ఉండదని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం నత్తనడక నడుస్తున్న విషయం వాస్తవమేనని అధికార పక్షం ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పెద్దగా ఆదాయం ఉండదని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, స్థలం కొరత వంటివి సమస్యగా మారాయని చెప్పారు. అదే విధంగా దళితులకు మూడెకరాల భూమి కొనుగోలు చేసి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, నిధులకు కొరత లేకపోయినా వ్యవసాయ భూమి దొరకడం లేదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు.