తెలంగాణ

నిరుద్యోగ సమస్యపై పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, మార్చి 6: నిరుద్యోగ సమస్యపై పోరాటం ఆపేది లేదని, వివిధ పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని టి.జెఎసి చైర్మన్ కోదండరామ్ తెలిపారు. తెలంగాణ విద్యార్థి సంఘాల జెఎసి సోమవారం నిరుద్యోగ సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. విద్యార్థి సంఘం నాయకులు రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జెఎసి చైర్మన్ క్రోదండరామ్, కాంగ్రెస్ నేత మల్లు రవి, టిడిపి నేతలు ప్రతాప్‌రెడ్డి, సతీష్‌మాదిగ, సిపిఐ కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, తదితరులు ప్రసంగించారు. కోదండరామ్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత నెల నిరుద్యోగ నిరసన ర్యాలీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 21, 22, 23 తేదీల్లో సుమారు 13 వేల మందిని అరెస్టు చేసిందని అన్నారు. ఆంక్షలతో ఉద్యమాన్ని ఆపలేరని, అణచివేత విద్యార్థుల్లో ఐక్యతను తీసుకువచ్చిందని వారి ద్వారా రాజకీయ, ప్రజా సంఘాల్లో ఐక్యత పెరిగి ఈ నిరసనలకు బలం చేకూరనుందని చెప్పారు.