తెలంగాణ

కందుల కొనుగోలు నిలిపివేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: రాష్ట్రంలో ఈసారి కంది పంట బాగా పండిందని, కందుల కొనుగోలు నిలిపివేయవద్దని ఎఫ్‌సిఐ ఎండిని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు. ఎఫ్‌సిఐ ఎండి త్రిపాఠికి హరీశ్‌రావు సోమవారం ఫోన్ చేసి రాష్ట్రంలో కందుల దిగుబడిని వివరించారు. ఈ సారి పంట బాగా పండిందని, దిగుబడి ఎక్కువగా వచ్చిందని చెప్పారు. ఎఫ్‌సిఐ కొనుగోలు కేంద్రాలను అర్ధాంతరంగా మూసివేసే ఆలోచన మానుకోవాలని చెప్పారు. ఈ అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు లేఖ రాసినట్టు గుర్తు చేశారు. ఎఫ్‌సిఐ కొనుగోలు కేంద్రాలు మూసివేయకుండా ఎఫ్‌సిఐ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని ఢిల్లీలోనే ఉన్న మార్కెటింగ్ శాఖ కార్యదర్శి పార్థసారథికి చెప్పారు. కందులు కొనుగోలు చేస్తున్న నాఫెడ్ సంస్థ ఎదుర్కొంటున్న ఖాళీ సంచులను సమకూర్చినట్టు నాఫెడ్ తెలిపింది. మరో ఐదు లక్షల ఖాళీ సంచులు కూడా ఒకటి రెండు రోజుల్లో రానున్నట్టు నాఫెడ్ అధికారులు తెలిపారు.
కొందరు ప్రైవేటు వ్యాపారులు రైతుల దగ్గర నాలుగువేల రూపాయలకు కొని ప్రభుత్వ రంగ సంస్థల కొనుగోలు కేంద్రాలకు మద్దతు ధర 5050 రూపాయలకు అమ్ముతున్నట్టు వస్తున్న వార్తలపై మంత్రి స్పందిస్తూ, వ్యాపారులు కొనుగోలు చేసిన కందులు రీ సైక్లింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ డిజి త్రివేదిని కోరారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్‌పిలకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి కోరారు.