తెలంగాణ

రైలు ఢీకొని కాళ్లు కోల్పోయిన మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: రైలు ఢీకొడంతో ఓ మహిళ రెండు కాళ్లు కోల్పోయిన సంఘటన హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. ఆదివా రం అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డు సమీపంలో పట్టాలు దాటుతున్న మహిళ ప్రమాదవశాత్తున కిందపడిపోయింది. తేరుకుని పైకి లేచే లోపే రైలు వచ్చి ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ మహిళ రెండు కాళ్లు తెగిపోయాయి. బాధితురాలు అమీర్‌పేటలోని ఓ ఆసుపత్రి ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న సువర్ణగా పోలీసులు గుర్తించారు. కాగా ఈమె రాజ్‌భవన్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నట్టు తెలిసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను మాజీ కార్పొరేటర్ షరీఫ్ సాయంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో సువర్ణ చెవిలో ఇయర్‌ఫోన్ ఉండడంతో ఆమె చరవాణిలో మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.