తెలంగాణ

మార్చిలో వడగళ్లు మామూలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణలో ఫిబ్రవరి చివరలో, మార్చి నెలలో వడగళ్లు పడడం సాధారణమేనని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ కేందం శాస్తవ్రేత్త డాక్టర్ నాగరత్న తెలిపారు. మంగళవారం రాత్రి ఆమె ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం వడగళ్ల వాన కురసిందని తెలిపారు. ప్రస్తుతం కర్నాటకలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని, తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయని వివరించారు. క్యుములోనింబస్ మేఘాల పైభాగాన వాతావరణంలో ఏర్పడ్డ మార్పుతో నీరు ఐస్‌గా మారుతుందని, ఇది చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి నేలపై పడుతుందని, దీనే్న మనం వడగళ్లవాన అంటూ ఉంటామన్నారు.