తెలంగాణ

పంచాయతీ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు పరాజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల పరిధిలో మంగళవారం జరిగిన పలు పంచాయితీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ చతికిల పడిందని, టిడిపి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సమష్టిగా పోటీ చేసి గెలిచాయని టిటిడిపి వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఉరిరికాయలపల్లి పంచాయితీలో టిడిపి మద్దతుతో సిపిఎం అభ్యర్ధి తన సమీప టిఆర్‌ఎస్ అభ్యర్ధిపై 129 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారన్నారు. అదే జిల్లాలో నెలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయితీలో 10వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్ధి రాంబాబు టిఆర్‌ఎస్ అభ్యర్ధిపై ఘన విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో నెర్రపల్లి గ్రామంలో జరిగిన వార్డు సభ్యుడి ఉప ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్ధి భిక్షపతి ఇతర పార్టీలన్నీ కలిసి బలపరిచిన తన సమీప అభ్యర్ధి లింగంపై విజయం సాధించారని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలో తిమ్మాపూర్ గ్రామ పంచాయితీ జరిగిన ఎన్నికల్లో టిడిపి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి యాదమ్మ తమ సమీప ప్రత్యర్ధి టిఆర్‌ఎస్ అభ్యర్ధిపై 125 ఓట్ల మెజార్టీతో గెలిచారని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఇదేస్ఫూర్తితో పోటీ చేసి టిఆర్‌ఎస్‌ను మట్టికరిపిస్తామన్నారు.