తెలంగాణ

వడగళ్ల వాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/నల్లగొండ/జనగామ/కీసర/్భమిని, మార్చి 7: అనుకోని అతిథిలా వచ్చిన వడగళ్ల వాన ప్రజలను ఆశ్చర్యపరిచింది. మంగళవారం ఉదయం నుంచి మేఘావృతమై ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు చినుకు జాడ కన్పించలేదు. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా కరీంనగర్, నల్లగొండ, జనగామ, కీసర, భీమిని తదితర ప్రాంతాల్లోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. భారీ గాలులతో వర్షం పడటంతో పలు ప్రాంతాల్లోని చెట్లు పడిపోయాయి. దీంతో పలు రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో అరగంట పాటు భారీ ఈదురుగాలులతో రాళ్ల వాన కురిసింది. ఒక్కసారిగా రాళ్ల వాన పడడంతో రోడ్లపై ఉన్న ప్రజలు సమీపంలోని ఇళ్లల్లోకి పరుగులు తీసారు భారీగా గాలులు వీచడంతో మామిడి పూతతోపాటు అక్కడక్కడ కాసిన మామిడి పిందెలు సైతం రాలిపోయాయి. మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన కొండవేణి మల్లయ్య (56) అనే గొర్రెల యజమాని మంగళవారం పిడుగుపాటుకు మృతిచెందాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో మంగళవారం ఆకస్మికంగా విరుచు కుపడిన వడగాళ్ల జనాన్ని వణికించింది. వడగళ్ల్ల ధాటికి రోడ్లపై, పంట చేనుల్లో ఉన్న ప్రజలు, రైతులు వడగళ్ల్ల బారిన పడకుండా ఉరుకులు, పరుగులు తీశారు. జములపేట, నెమరగోముల, రాయరావుపేట, కొండమడుగు గ్రామాల్లో వడగళ్లు కురిశాయి. ఆయా గ్రామాల్లో వరి పంటలు పలుచోట్ల దెబ్బతిన్నాయి. వలిగొండలో కొబ్బరి చెట్లపై పిడుగుపడి ఐదు మేకలు చనిపోగా, కొబ్బరి చెట్లు కాలిపోయాయి. గ్రామాల్లో ప్రస్తుతం రబీ వరి పంటలు పొట్ట, కంకి దశలో ఉండడంతో అకాల వర్షాలు రైతులను వణికిస్తున్నాయి.
జనగామ జిల్లా చేర్యాల మండ లంలో తాడూర్, చిట్యాల గ్రామాలతో పాటు కొమురవెళ్లి మండలం మర్రిముచ్చాల, కొండపాక మండలం ఎలికట్ట గ్రామాలలో మంగళవారం సాయంత్రం వడగళ్ల వాన పడింది. దీంతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, మామిడి, దోస తోటలకు తీవ్ర నష్టం సంభవించింది. కొన్ని ప్రాంతాలలో చేతికి అందుతుందన్న వరిచేను సైతం ఈ వడగళ్ల వర్షానికి నేలపాలైంది. దాదాపు రెండు వందల ఎకరాల మేర పంటకు నష్టం సంభవించింది.
కీసర మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. ముందుగా ఈదురు గాలులతో మొదలైన వాన మెల్లగా భారీ వర్షానికి దారితీసింది. వడగళ్లు పెద్దఎత్తున పడటంతో మండలంలోని పలుగ్రామాల్లోని రేకులు పగిలిపోయి భారీ నష్టం సంభవించింది. భోగారం గ్రామంలోని దాదాపు 40 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మామిడి తోటలు, ద్రాక్షతోటలు నేల రాలిపోయాయి. వరి, ఆకుకూరలు నేలమట్టమయ్యాయి. మండలంలో దాదాపు యాభై హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లా భీమిని, కనె్నపల్లి మండలాల్లోని పలు గ్రామాలలో ఈదురు గాలులతో కురిసిన వర్షం గ్రామాలలో నష్టాన్ని మిగిల్చింది. భీమిని మండలంలోని భీమిని, వడాల గ్రామాలలో మామిడిపూత నేల రాలగా తిమ్మాపూర్ గ్రామాలలో 9 ఇళ్ల్ల పైకప్పులు ఈదుగు గాలులకు లేచి పోయి ద్వసం అయ్యాయి. కనె్నపల్లి మండలం మెట్‌పల్లి, నాయకునిపేట, సాలిగాం గ్రామాల్లో ఈదురు గాలుల తాకిడికి మెట్‌పల్లిలో పది ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా ధ్వంసమైంది.