తెలంగాణ

తేలిగ్గా ఉంది.. సమయం చాలలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: సిబిఎస్‌ఇ 10వ తరగతి పరీక్షలు (స్కీం -2), 12వ తరగతి పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు 12వ తరగతి ఇంగ్లీషు తొలి పేపర్ పరీక్ష తేలిగ్గా ఉందని, అయితే సుదీర్ఘ సమాధానాలతో సమయం చాల లేదని విద్యార్ధులు అభిప్రాయపడ్డారు. పదో తరగతి పరీక్షలను దేశవ్యాప్తంగా 8,86,506 మంది, 12వ తరగతి పరీక్షలను 10,98,891 మంది రాస్తున్నారు. గత ఏడాది కంటే పదో తరగతిలో 15.73 శాతం, 12వ తరగతిలో 2.82 శాతం మంది అధికంగా పరీక్షలు రాస్తున్నారు. చెన్నై జోన్‌లో 10వ తరగతి 1,54,401 మంది, 12వ తరగతిలో 59,014 మంది రాస్తున్నారు. తెలంగాణ ఆంధ్రాలో కలిపి పదో తరగతికి 30వేల మంది, 12వ తరగతికి 24 వేల మంది హాజరవుతున్నారు. ప్రశ్నలు అన్నీ దాదాపు ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాల నుండే వచ్చాయని, మరీ కష్టంగా ఏమీ అనిపించలేదని ఒక విద్యార్ధి వ్యాఖ్యానించాడు. సాహిత్య విభాగంలో మాత్రం ప్రశ్నలు చదవడానికి, రాయడానికి కూడా చాలా సమయం పట్టిందని పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు 16,363 కేంద్రాలు, 12వ తరగతి పరీక్షలకు 10,678 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిబిఎస్‌ఇ సైతం ఈసారి మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది. ఈ మొబైల్ యాప్ ద్వారా పరీక్ష కేంద్రాలను విద్యార్ధులు తేలికగా తెలుసుకునే వీలుకల్పించారు.
19న తెలంగాణ ఇంటర్ పరీక్షలు యథాతథం
శాసనమండలి ఎన్నికల సందర్భంగా 9వ తేదీన జరగాల్సిన ఇంటర్ సెకండియర్ పరీక్షలను బోర్డు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. అయితే హైదరాబాద్ శాసనమండలి ఎన్నిక రద్దవ్వడమే గాక, దానిని తిరిగి 19వ తేదీన నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దాంతో ఇంటర్ పరీక్ష వాయిదా పడుతుందేమో అన్న విద్యార్ధుల ప్రచారాన్ని బోర్డు అధికారులు కొట్టిపడేశారు. 19న ఇంటర్ సెకండియర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని పేర్కొన్నారు.
సిఎఎస్ మంజూరు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్లకు సిఎఎస్ ఉత్తర్వులను మంజూరు చేస్తూ కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాణీ ప్రసాద్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం టిజిసిజిటిఎ అధ్యక్షుడు చెప్పెల హరినాధ శర్మ, ప్రధానకార్యదర్శి ఎన్ వి ఎన్ చారి, సహ అధ్యక్షుడు యాదయ్యలు తెలిపారు. డాక్టరేట్ ఉండి నాలుగేళ్ల సేవా కాలాన్ని పూర్తి చేసుకున్న డిగ్రీ కాలేజీ లెక్చరర్లకు ఎజిపిని ఏడు వేలకు పెంచారని అన్నారు.