తెలంగాణ

నిరంతరాయంగా విద్యుత్ సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా కార్యాచరణను రూపొందించుకోవాలని విద్యుత్ సంస్థలను ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు. ప్రస్తుత రబీ సీజన్‌తో పాటు వేసవిలో విద్యుత్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై విద్యుత్ సంస్థలతో ప్రభాకర్‌రావు గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీన అత్యధికంగా 9003 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అయిందన్నారు. ఈ నెల చివరి వరకు గరిష్టంగా విద్యుత్ డిమాండ్ 10,000 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. విద్యుత్ డిమాండ్ ఎంత వరకు పెరిగినా డిమాండ్ మేరకు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సింగరేణి నుంచి వచ్చే 1200 మెగావాట్లు, 1180 మెగావాట్ల సౌరవిద్యుత్ వల్ల విద్యుత్ కొరత తలెత్తకుండా దోహదం చేస్తుందన్నారు.
సదరన్ డిస్కామ్ సిఎండి రఘుమారెడ్డి మాట్లాడుతూ, రైతాంగానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా కోసం అదనంగా విద్యుత్ లైన్లు ఏర్పాటు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వల్ల మెరుగైన విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నామన్నారు. గత 16 నెలలలో అదనంగా 54 కొత్త 132/33 కెవి సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా కోసం చేపడుతున్న చర్యలను పిజిసిఐఎల్ సిఎండి స్వయంగా ఫోన్ చేసి అభినందించారన్నారు. స్థానిక అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర సిబ్బంది స్థానికంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు. ఈ రబీ సీజన్‌లో అత్యధిక విద్యుత్ సరఫరాకు డిమాండ్ ఉండటంతో ఎక్కడా అంతరాయం ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు ఇంజనీర్లు వెంటనే స్పందించాలని, లేనిపక్షంలో రైతులు స్వతహాగా విద్యుత్ పునరుద్ధరణ కోసం పూనుకుంటారని దీని వల్ల ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితి ఎక్కడైనా తలెత్తితే దానికి అసిస్టెంట్ ఇంజనీర్లను బాధ్యులుగా చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఆ దిశగా విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉండాలన్నారు.

చిత్రం.. హైదరాబాద్‌లో గురువారం జరిగిన విద్యుత్ సంస్థల
సమన్వయ సమావేశంలో మాట్లాడుతున్న ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్‌రావు