తెలంగాణ

దూకుడు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిర్మొహమాటంగా నిలదీయాలని, దూకుడు పెంచాలని, విభేదాలు విడనాడి సమష్టిగా పోరాడాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై రాజీలేకుండా పోరాడాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. కెసిఆర్ ప్రజా వ్యతిరేకవిధానాలపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొందని, కాంగ్రెస్ పార్టీ నేతలు జనంలోకి వెళ్లి కింది స్థాయి నుంచి ఉద్యమాలు నిర్మించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పుకుంటున్న కెసిఆర్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కెసిఆర్ అలా మాట్లాడుతున్నారన్నారు. ఎగ్జిట్ పోల్స్, సర్వేలన్నీ బోగస్ అని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ అసెంబ్లీలో సిఎల్‌పి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ సాధ్యమైందన్నారు. కెసిఆర్ మాయమాటలతో, ఆచరణకు నోచుకుని హామీలతో కాలక్షేపం చేస్తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో డబుల్ బెడ్‌రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి అంశాలపై నిలదీయాలన్నారు. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ స్కీం అమలు చేయడంలో కెసిఆర్ విఫలమయ్యారన్నారు. అసెంబ్లీలో కెసిఆర్ ఎత్తుగడలను చిత్తు చేసి సంక్షేమ పథకాల అమలులో విఫలమైన అంశాలపై సమష్టిగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి జనంలో ఆదరణ చెక్కుచెదరలేదని, కార్యకర్తలు, నేతలతో మమేకం కావాలన్నారు. ఈ సమావేశంలో సిఎల్‌పి నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు డికె అరుణ, భట్టి విక్రమార్క, సంపత్‌కుమార్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
మహిళలు ప్రభుత్వంపై పోరాడాలి
రాష్ట్రంలో మహిళలను రాజకీయంగా ఎదగనీయకుండా చేసిన టిఆర్‌ఎస్‌పై మహిళలు పోరాటం చేయాలని గురువారం గాంధీభవన్‌లో జరిగిన మహిళాకాంగ్రెస్ సమావేశంలో దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా పదవి ఇవ్వని దుస్థితిలో కెసిఆర్ ఉన్నారని విమర్శించారు. మహిళలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మహిళలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందన్నారు. మహిళలకు స్థానం లేకుండా అవమానించిన చరిత్ర కెసిఆర్‌దేనన్నారు. మైనార్టీ సెల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లౌకికవాదం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఎంఐఎంతో పోరాడేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంకావాలన్నారు. 19న షాద్‌నగర్‌లో సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని షాద్‌నగర్‌లో కెసిఆర్ హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఎఐసిసి కార్యదర్శి కుంతియా తదితర నేతలు పాల్గొన్నారు.

చిత్రం..గురువారం గాంధీభవన్‌లో జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో ప్రసంగిస్తున్న ఎఐసిసి నేత దిగ్విజయ్ సింగ్.