తెలంగాణ

ఈ వారంలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: వేసవితో ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం కొద్దిగా చల్లగా ఉంటున్నా, 10 గంటల తర్వాత వేడెక్కుతున్నది. క్రమేణా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ వారంలో వేసవి తీవ్రత పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారి వైవి రామారావు తెలిపారు. ఈశాన్య నుంచి వేడి గాలి వీచే అవకాశం ఉంది. తెలంగాణలో ఉష్ణోగ్రత 34 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని, కనిష్ణ ఉష్ణోగ్రత 19 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 11 నుంచి 17 వరకు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల, వరంగల్ (అర్బన్), వరంగల్ (రూరల్), జనగాం, యాదాద్రి-్భవనగిరి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 34 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని, కనిష్ట ఉష్ణొగ్రత 19 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కొమురంబీం-అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్-్భపాల్‌పల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగుళాంభ-గద్వాల్ జిల్లాల్లో 35 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు.