తెలంగాణ

ముగ్గురు టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఉల్లోళ్ల గంగాధర్‌గౌడ్‌లు శాసన మండలి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నకయ్యారు. మూడు స్థానాలకు ముగ్గురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరికి రిటర్నింగ్ అధికారి అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారామ్ శుక్రవారం ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్సీలతో కలిసి హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడం సంతోషకరమని అన్నారు. ఇది ప్రెండ్లీ ప్రభుత్వం అని అన్నారు. గత అరవై ఏండ్లలో సాధించని అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం 33 నెలల్లో సాధించిందని, గవర్నర్ ప్రసంగంలో ఇది ప్రతిబింబించిందని నాయిని అన్నారు. ఒక పార్టీకి క్యాడర్ లేదు, ఇంకో పార్టీకి లీడర్ లేడని టిడిపి కాంగ్రెస్ పార్టీలను ఎద్దెవా చేశారు. శాసన సభలో విపక్షాలు లేవనెత్తిన అంశాలకు ధీటుగా సమాధానం ఇస్తామని నాయిని చెప్పారు. ప్రజల్లో టిఆర్‌ఎస్‌కు ఉన్న బలం సర్వేలో ప్రతిబింబించిందని అన్నారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్‌ఎస్‌కు 106 సీట్లు వస్తాయని అన్నారు. తమను గుర్తించి ముఖ్యమంత్రి అవకాశం కల్పించినందుకు ముగ్గురు ఎమ్మెల్సీలు ధన్యవాదాలు తెలిపారు.

చిత్రాలు....శుక్రవారం రిటర్నింగ్ అధికారి రాజా సదారామ్ నుంచి ధృవీకరణ పత్రాలు అందుకుంటున్న ఏకగ్రీవంగా ఎన్నికైన
ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, మైనంపల్లి హనుమంతరావు