తెలంగాణ

27వరకూ ఉభయ సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నెల 13న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వార్షిక (2017-18) బడ్జెట్‌ను శాసనసభలో ప్రతిపాదిస్తారు. శుక్రవారం ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగించారు. అనంతరం శాసనసభ సభాపతి ఎస్. మధుసూదనాచారి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి టి. హరీశ్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, మజ్లిస్ పక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, బిజెపి పక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి, టిడిపి పక్షం నాయకుడు ఎ. రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, శాసనమండలి కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజాసదారామ్, జాయింట్ సెక్రటరీ నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 25న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో సమావేశాలను ముగించుకుందామని మంత్రి హరీశ్ రావు చెప్పగా, కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. బడ్జెట్ సమావేశాలను ఇంతగా కుదించడం భావ్యం కాదని, గతంలో 31 రోజులు జరిగేవని వారు గుర్తు చేశారు. కనీసం ఈ నెల 31 వరకైనా నిర్వహించాలని కోరారు. చివరకు మరో రోజు పొడిగించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 26న ఆదివారం కావడంతో, 27న సోమవారం సమావేశాలు ముగించేందుకు అంగీకరించారు. ఇలాఉండగా శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించుకుని, 13న బడ్జెట్ ప్రతిపాదించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 18 నుంచి 24 వరకు పద్దులపై చర్చించి ఆమోదిస్తారు. 19న ఆదివారం సెలవు. మొత్తం 14 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరుగుతాయి.

చిత్రం..శుక్రవారం స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో
అసెంబ్లీ సమావేశాలపై చర్చిస్తున్న అధికార, ప్రతిపక్ష సభ్యులు