తెలంగాణ

భూసేకరణ చట్టానికి పచ్చజెండా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ భూసేకరణ సవరణ చట్టాన్ని కేంద్ర హోంశాఖకు పంపి రెండు నెలలు గడచినా ఆమోదం లభిస్తూ ఎటువంటి సమాచారం లేదు. కేంద్ర హోంశాఖ ద్వారా ఈ సవరణ చట్టం రాష్టప్రతి భవన్‌కు చేరుతుంది.
రాష్టప్రతి భూసేకరణ సవరణ చట్టంపై సంతకం చేసిన తర్వాత ఆమోద ముద్ర లభిస్తుంది. కేంద్ర హోంశాఖ నుంచి భూసేకరణ సవరణ చట్టంలోని అంశాలపై పంపిన సందేహాలకు రాష్ట్ర రెవెన్యూ, ఇరిగేషన్, భూపరిపాలన శాఖలు ఎప్పటికప్పుడు సమాధానాలు పంపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల తర్వాత తెలంగాణ భూసేకరణ చట్టానికి కేంద్రం పచ్చజెండా ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఒక కోటి ఎకరాలను సాగునీటిని సరఫరా చేసేందుకు ఒక లక్ష ఎకరాలను భూమిని సేకరించాలని కెసిఆర్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బృహత్తర మైన ఈ కార్యక్రమం అమలుకు కెసిఆర్ గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. కాని భూసేకరణ పనులకు న్యాయస్ధానాన్ని కొందరు ఆశ్రయించడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.
కేంద్రం 2013 భూసేకరణ చట్టాన్ని సవరించి రాష్ట్ర ప్రయోజనాలకు, రైతులు, రైతు కూలీల మేలు కోసం ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేసింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు రాష్ట్ర అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర చట్టానికి సవరణలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని జనవరి నెలలోనే కేంద్ర హోంశాఖకు పంపింది. కేంద్ర హోంశాఖ క్లియరెన్సు లభించన తర్వాత ఈ చట్టాన్ని రాష్టప్రతి భవన్‌కు పంపిస్తారు. ఈ చట్టానికి కేంద్రం ఆమోదం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీకి వెళ్లి త్వరితగతిన అనుమతి ఇవ్వాలని కోరారు. భూసేకరణ సవరణ చట్టంకు అనుమతి ఇవ్వడం వల్ల భూసేకరణ పనులు వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ఉంది.
రైతులతో పాటు భూమిమీద ఆధారపడిన రైతు కూలీలు, పరోక్షంగా ఆధారపడిన కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ భూసేకరణ సవరణ చట్టంలో అనేక సదుపాయాలు కల్పించారు. రాష్ట్రప్రభుత్వం తొలుత జీవో 123ను జారీ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం జీవో 190, 191తో పాటు జీవో 38ని కూడా జారీ చేసింది. జీవో 123 అమలుకు హైకోర్టు బ్రేక్‌లు వేయడంలో రాష్ట్రప్రభుత్వం జీవో 38 ద్వారా వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులపై ఆధారపడిన వారు, ఇతర వర్గాలకు కూడా తగిన నష్టపరిహారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పిస్తూ పలు అంశాలను పొందుపరిచారు. ఇప్పటికే భూమిని సేకరించిన చోట అటంకాలు లేని చోట ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. కొన్ని చోట్ల మాత్రం ప్రాజెక్టుల నిర్మాణం పనులకు అంతరాయం కలుగుతున్నట్లు సాగునీటి ఇంజనీర్లు చెప్పారు. భూమిని సేకరించే గ్రామాల పరిధిలో గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి, నిర్వాసితులకు చెల్లించే నష్టపరిహారం డిపాజిట్ చేస్తామని, నిర్వాసితులకు పునరావాసం కూడా గ్రామ కమిటీలు చెప్పినట్లుగా చేస్తామని ప్రభుత్వం కోర్టును అభ్యర్ధించింది. కాగా ఈ విషయమై కోర్టు అనుమతి లభించాల్సి ఉందని రెవెన్యూ, సాగునీటి వర్గాలు తెలిపాయి.