తెలంగాణ

14 నుండి పదోతరగతి పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ రాష్ట్రంలో 2017 సంవత్సరం పదోతరగతి పరీక్షలను ఈ నెల 14 నుండి 30 వరకు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఆర్. సురేందర్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని (నాంపల్లి) డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయని, విద్యార్థులను ఉదయం 8.45 గంటలకే పరీక్షాహాలులోకి అనుమతిస్తామన్నారు. ఉదయం 9.30 కు పరీక్షలు ప్రారంభమైన తర్వాత ఐదు నిమిషాల వరకు (9.35 వరకు) విద్యార్థులను పరీక్షాహాలులోకి అనుమతిస్తామని, ఆ తర్వాత అనుమతించబోమన్నారు. పరీక్షా సమయం పూర్తయ్యేవరకు విద్యార్థులను బయటకు వెళ్లేందుకు అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు 2,556 కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటిలో 2,411 కేంద్రాలు రెగ్యులర్ సెంటర్లని, 145 ప్రైవేట్ సెంటర్లని వివరించారు. వీటిలో 358 ‘సి’ క్యాటగిరి కేంద్రాలని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 వ సెక్షన్ విధిస్తున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా జరిగే పరీక్షలకు 5,38,226 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, వీరిలో 5,09,831 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 28,395 మంది గతంలో ఫెయిల్ అయినవారని వివరించారు.
పరీక్షల పర్యవేక్షణకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని సురేందర్‌రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖలోని ఉన్నతాధికారులను జిల్లాల వారీగా ‘జిల్లాస్థాయి ఆబ్జర్వర్స్’గా నియమించామన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్‌పి, జిల్లా స్థాయి అధికారుల (రెవెన్యూ, ట్రెజరీ) సమన్వయంతో పనిచేస్తారన్నారు.
విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించామని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఎవరికైనా హాల్‌టికెట్లు రాకపోయినా, పొరపాటుగా పోగొట్టుకున్నా వెబ్‌సైట్ (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.బెస్ట్‌తెలంగాణ.ఓఆర్‌జి) నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టిక్కెట్‌పై పధానోపాధ్యాయుని సంతకం అవసరం లేదన్నారు. సెల్‌ఫోన్లు, బ్లూటూత్‌లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను విద్యార్థులు తమ వెంట పరీక్షా హాలులోకి తీసుకురాకూడదని, ఎవరైనా తీసుకువస్తే వారిని డీబార్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఇన్‌విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది కూడా మొబైల్‌ఫోన్లను తమ వెంట పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావదని హెచ్చరించారు. అత్యవసర సమయంలో చీఫ్ సూపరింటెండెంట్లు మొబైల్ ఫోన్లు వాడాల్సి వస్తే, డ్యూటీలో ఉన్న కానిస్టెబుల్ వద్ద ఉండే ఫోన్ వాడాలని, అది కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.
ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో ఈ కేంద్రాల సమీపంలోని జిరాక్స్ (్ఫటోస్టాట్) సెంటర్లను మూసివేయిస్తున్నామన్నారు.
అభ్యర్థులు కానివారు ఎవరైనా పరీక్షా కేంద్రాల్లోకి వచ్చి, పరీక్షలకు ఆటంకం కలిగిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మూడురోజుల ముందే..
విద్యార్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రెండు, మూడు రోజుల ముందే పరిశీలించాలని డైరెక్టర్ సురేందర్‌రెడ్డి సూచించారు. విద్యార్థులు సాధారణ దుస్తులు మాత్రమే ధరించాలని, స్కూల్ యూనిఫాం ధరించవద్దని సూచించారు. పరీక్షా కేంద్రాలకు రవాణా (ఆర్టీసి) సౌకర్యం కల్పించామని, కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు తదితర కనీస సౌకర్యాలు కల్పించామని చెప్పారు. అత్యవసర సమయంలో ప్రాథమిక చికిత్సకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు.

పదవ తరగతి
పరీక్షల టైంటేబుల్
ఈ నెల 14 న ప్రారంభమయ్యే పదవ తరగతి బోర్డ్ పరీక్షల టైంటేబుల్ ఈ విధంగా ఉంది. అన్ని రోజుల్లో, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఆయా పేపర్ కోడ్‌లను అనుసరించి పరీక్ష ముగిసే సమయాలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.
తేదీ సబ్జెక్ట్/పేపర్
14-03-17 ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
15-03-17 ఓఎస్‌ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
16-03-17 ఎస్‌ఎస్‌సి ఒకేషనల్ కోర్స్ (్థయరీ)
17-03-17 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (గ్రూప్-ఎ)
17-03-17 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
(కాంపోజిట్‌కోర్స్)
18-03-17 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2 (గ్రూప్-ఎ)
18-03-17 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
(కాంపోజిట్ కోర్స్)
20-03-17 సెకండ్ లాంగ్వేజ్
21-03-17 ఇంగ్లీష్ పేపర్-1
22-03-17 ఇంగ్లీష్ పేపర్-2
23-03-17 మ్యాథమెటిక్స్ పేపర్-1
24-03-17 మ్యాథమెటిక్స్ పేపర్-2
25-03-17 జనరల్ సైన్స్ పేపర్-1
27-03-17 జనరల్ సైన్స్ పేపర్-2
28-03-17 సోషల్ స్టడీస్ పేపర్-1
30-03-17 సోషల్ స్టడీస్ పేపర్-2