తెలంగాణ

తెలంగాణలోనూ ఇక యుపి ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2019లో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటు వంటి ఫలితాలే వస్తాయని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ధీమాగా అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయమని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో గ్రామ బాటకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో తమ పార్టీకి లభించిన ఫలితాలతో ప్రాంతీయ పార్టీలకు, పలు జాతీయ పార్టీలకు కనువిప్పు కావాలని అన్నారు. కుల, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఓటర్లు బిజెపికి అనుకూలంగా తీర్పునిచ్చారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కంచుకోటలైన రాయబరేలీ వంటి స్థానాల్లోనూ తమ పార్టీ దూసుకుని పోయిందని అన్నారు. దేశంలో వామపక్షాలు ఉనికి కోల్పోతున్నాయని ఆయన తెలిపారు. ప్రజల నిశ్శబ్ద తీర్పు చారిత్రాత్మకమైందని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫలితాలు దిక్సూచి వంటివని ఆయన తెలిపారు. పొత్తు లేనిదే తెలంగాణలో బిజెపికి భవిష్యత్తు లేదు కదా? అన్న ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు. పొత్తుల కోసం తహతహలాడడం లేదని అన్నారు. పొత్తు ఉంటేనే పార్టీ కొద్దో గొప్పో సీట్లు గెలుస్తుందన్న వాదన సరైంది కాదని, లోగడ 1991లో, 1998లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తాను పొత్తు లేకుండా ఘన విజయం సాధించానని దత్తాత్రేయ గుర్తు చేశారు. 1998 ఎన్నికల్లో తమ పార్టీకి 28 శాతం ఓట్లు లభించాయని ఆయన చెప్పారు.
వివిధ పథకాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమై వాటిని మరింత వేగంగా అమలుకు కృషి చేయాలని ఆయన కోరారు.
కార్యాలయం కిటకిట
ఇలాఉండగా బిజెపి రాష్ట్ర కార్యాలయం కార్యకర్తలతో కిటకిటలాడింది. హోలి పండుగనే కాకుండా, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సంతోషంతో కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు పంచుకున్నారు. విలేఖరుల సమావేశంలో బిజెపి నాయకులు జి.ప్రేమేందర్ రెడ్డి, కృష్ణసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.