తెలంగాణ

వేర్వేరుచోట్ల 13 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: హోలీ పండుగ పలు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల 13 మంది మృతి చెందారు. ఆదివారం హోలీ పండుగలో రంగులు చల్లుకుని కేరింతలు కొట్టిన యువత, అనంతరం స్నానాల కోసం చెరువుల్లో దిగి మృత్యువాతపడ్డారు. హైదరాబాద్ శివారులోని గండిపేట చెరువులో మునిగి ఇద్దరు మృతి చెందగా, మిగిలిన వారు ఇతర చోట్ల మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్-బలరాంనగర్‌కు చెందిన టి.పవన్‌కుమార్‌రెడ్డి (18), మరో యువకుడు ఎం.గణేష్ (18) హోలీ వేడుకలు ముగిసిన తర్వాత స్నానం చేసేందుకు గండిపేట చెరువులో దిగి ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయారు. పవన్‌కుమార్‌రెడ్డి, గణేశ్‌లతో పాటు మొత్తం 8 మం ది గండిపేట చెరువు వద్దకు హోలీ అనంతరం స్నానాలు చేసేందుకు వెళ్లినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి వద్ద పొల్లల నాగరాజు ఈత కొలనులో దిగి మృతి చెందాడు. ఇతను అంబర్‌పేటకు చెంది న వాడిగా గుర్తించారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం కొంపెల్ల గ్రామానికి చెందిన సిహెచ్ మహేశ్ (18) ఆదివారం హోలీ ఆడి, అనంతరం తన స్నేహితులతో కలిసి వ్యవసాయ బావి వద్దకు స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి ఈత రాక చనిపోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో స్నేహితులతో కలిసి హోలీ ఆడి స్నానం చేసేందుకు సరళసాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకొని స్నానం చేసి తిరిగి వెళుతుండగా బైకు అదుపు తప్పి వనపర్తి పట్టణానికి చెందిన శివ, రాజు, రాజేష్ పడిపోయారు. ఈ ఘటనలో శివ (21) అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరూ గాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని అయ్యగారి పల్లెకు చెందిన దొంతికుంట చెరువుకు స్నానం చేసేందుకు బైరి వీరేష్ (10), నర్రా చరణ్ (9) వెళ్లి తక్కువ లోతు ఉందని భావించి మునిగి చనిపోయారు. అలాగే జనగామ జిల్లా నర్మెట మండలంలోని బొమ్మకూరు-హన్ముంతాపూర్ మధ్య ఉన్న రిజర్వాయర్‌లో జనగామకు చెందిన క్రాంతికుమార్ (19), నాగబండి నాగరాజు (19), అఖిల్ అనే మరో యువకుడు దిగారు. తొలుత నీటిలో దిగిన అఖిల్ మునిగిపోవడం మిగిలిన ఇద్దరు గమనించి కాపాడే ప్రయత్నంలో వారు కూడా మునిగిపోయారు. దీంతో క్రాంతికుమార్, నాగరాజు మృతి చెందారు. అఖిల్ మాత్రం వారి సహాయంతో బయటపడ్డాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వర్ధరాజ్‌పల్లిలో శ్రీకాంత్ (9), ప్రశాంత్ (13) హోలీ వేడుకల తర్వాత నీట మునిగి చనిపోయారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో హోలీ సంబురాలు జరుపుకున్న అనంతరం ఐదుగురు విద్యార్థులు గోదావరిలో స్నానం చేస్తూ లోతుగా వెళ్లి గల్లంతయ్యారు. అక్కడే ఉన్న జాలర్లు గమనించి వెంటనే ముగ్గురు యువకులను రక్షించారు. ఇద్దరు రామ్‌ప్రసాద్, రమేష్ మాత్రం నీళ్లలో మునిగి చనిపోయారు.
ఇద్దరు గల్లంతు
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నామాపూర్‌కు చెందిన ముల్క లక్ష్మి, మల్లేశం కుమారుడు సాయికుమార్ (15) తన స్నేహితులతో కలిసి హోలీ వేడుక జరుపుకున్న అనంతరం గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో దిగి ఈతకువెళ్లి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి (24) హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం చెరువులో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు.