తెలంగాణ

విద్యకు దక్కని ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: విద్యకు కనీసం బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించాలని విద్యార్ధి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నా తెలంగాణ ప్రభు త్వం మాత్రం 12,705.72 కోట్లు కేటాయించడంపై విద్యానిపుణులు పెదవి విరిచారు. బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ విద్యకు సంబంధించి ఎన్నో మంచి మాటలు చెప్పి, చివరికి కేటాయింపులు మాత్రం అరకొరగా ఇవ్వడం దారుణమని వారు పేర్కొన్నారు. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈటల రాజేందర్ విద్య మనిషికి మూడో కన్నువంటిదని, సమాజం సాధించిన నాగరికత విలువలు, విజ్ఞానం కొత్త తరానికి అందించడానికి విద్య ఒక్కటే సాధనమని, విద్య సామాజిక గౌరవాన్ని పెంచుతుందని, సాధికారత ఇస్తుందని పేర్కొన్నారని నిధులు మాత్రం ఎక్కువగా కేటాయించలేదని అన్నారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని, ఉస్మానియా సెంటినరీ బ్లాక్ నిర్మాణానికి , ఉత్సవ నిర్వహణకు 200 కోట్లు కేటాయించారని, మిగిలిన వర్శిటీల్లో వౌలిక వసతుల కల్పనకు మరో 200 కోట్లు కేటాయించారని, మొత్తంగా చూస్తే 12,705.72 కోట్లు కేటాయించారని ఆ నిధులు ఏ విధంగానూ సరిపోవని ఎబివిపి, ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్ నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌తో విద్యారంగం వికసించే అవకాశం లేదని తెలంగాణ ప్రజల విద్యా సంస్కరణ ఉద్యమం అధ్యక్షుడు కంచె ఐలయ్య, ప్రధానకార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. పూర్వ ప్రాధమిక విద్య, ఇంగ్లీషు మీడియం, ఇంటర్ విద్యా విస్తరణ, యూనివర్శిటీలకు కనీసం 30వేల కోట్లు కావాలని అన్నారు. గత ఏడాది కంటే కేవలం 1967 కోట్లు కేటాయించారని పాఠశాల విద్య పరిస్థితి మరీ దారుణమని అన్నారు.