తెలంగాణ

ఆరోపణలకు ఇవిగో సాక్ష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: గవర్నర్ ప్రసంగం అబద్దాల పుట్ట అని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ అసత్యాలే ఉన్నాయని తాము నిరూపిస్తామని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. అబద్దాలు ఉన్నట్లు నిరూపిస్తే 5 నిమిషాల్లో రాజీనామా చేస్తానన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పుడేమంటారని ఉత్తమ్ ప్రశ్నిస్తూ సాక్ష్యాలతో 40 పేజీల ప్రతులను మీడియాకు విడుదల చేశారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ నెం.1గా ఉందని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో వాస్తవం లేదని, తెలంగాణ ఆరవ స్థానంలో ఉందని అన్నారు. పొరుగు రాష్టమ్రైన ఆంధ్ర ప్రదేశ్ కనీసం 5వ స్థానంలో ఉం దని ఆయన చెప్పారు. పైగా పెట్టుబడుల విషయానికి వస్తే 2015లో గుజరాత్‌లో 64,734 కోట్లు ఉం టే, తెలంగాణలో 10,209 కోట్లు ఉన్నాయని, 2016లో కర్నాటకలో1,54,173 కోట్లు ఉంటే, తెలంగాణలో 22,147 కోట్లు ఉన్నాయని, 2017లో గుజరాత్‌లో 33,871 కోట్లు కాగా తెలంగాణలో 89 కోట్లు మాత్రమే వచ్చాయని అన్నారు. విద్యుత్తు సరఫరా విషయానికి వస్తే తెలంగాణలో నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నదని అన్నారు. కానీ వాస్తవానికి విద్యుత్తు తమ కాంగ్రెస్ ప్రభు త్వం చేసిన పనుల ఆధారంగానే సరఫరా చేయగలుగుతున్నారని వివరించారు. 2014లో దేశంలోని 28 రాష్ట్రాల్లో విద్యు త్తు సమస్యలు, కోతలు ఉండేవి కానీ గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు వల్ల ప్రస్తుతం 29రాష్ట్రాలలో కూడా విద్యుత్తు కోత లేదని, అంతా మిగులు విద్యుత్తు ఉందని ఆయన వివరించారు. రాష్ట్రాల వారీగా ఐటి ఎగుమతులు పరిశీలిస్తే కర్నాటక 2.20 లక్ష కోట్లు కాగా, తెలంగాణ 75 వేల కోట్లతో నాలుగవ స్థానంలో ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కు హెల్త్ కార్డులు ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగంలో గొప్పగా చెప్పారు కానీ ఒక్క హెల్త్ కార్డు కూడా కార్పోరేట్ ఆసుపత్రిలో పని చేయడం లేదని ఉత్త మ్ విమర్శించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రెండు సంవత్సరాలుగా చెల్లించడం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి దశలో ఉంటే బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు.

రెండున్నరేళ్లలో రూ. 70వేల కోట్లు
ప్రభుత్వ అప్పులపై ఉత్తమ్ ఆందోళన
తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన ఈ రెండున్నర ఏళ్ళలో 70 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో నిలబడిందని అన్నారు. సోమవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదించారు. సభ వాయిదాపడిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ళు, హెల్త్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నదే తప్ప ఇవ్వలేదని అన్నారు. ఇచ్చిన ఒకటో, అరో హెల్త్ కార్డులు పని చేయడం లేదని ఆయన విమర్శించారు. 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేదని ఆయన తెలిపారు. రెండు పడక గదుల ఇండ్ల నిర్మా ణం చేపట్టలేదని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. కమిషన్ రాదు కాబట్టి పట్టించుకోలేదని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు నిధులు విడుదల చేయలేదని అన్నారు. అర్హులైన పేదలకు మూడు ఎకరాల చొప్పున భూమి ఇచ్చేందుకు వంద సంవత్సరాలు పడుతుందేమోనన్న అనుమానాన్ని ఉత్తమ్ వ్యక్తం చేశారు. వ్యవసాయంతో పాటు రుణ మాఫీని చిన్న చూపు చూడడం భావ్యం కాదని అన్నారు. గత ఏడాది కేటాయించిన నిధుల్లో సగమే ఖర్చు చేశారని తెలిపారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించిన విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కూ, దళిత, గిరిజన పేదలకు 3 ఎకరాల భూ పంపిణీకి నిధులు విడుదల చేయలేదని అన్నారు. అడ్డగోలుగా అప్పులు చేస్తూ ప్రభుత్వం ప్రమాదకర బాటలో నడుస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ మీడియాపాయంట్ వద్ద మాట్లాడుతున్న టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి