తెలంగాణ

కరెంటు కోతలకు కాలం చెల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రప్రభుత్వం విద్యుత్ సబ్సిడీల కింద రూ. 4203.21 కోట్లను కేటాయించింది. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీని 16,306 కోట్లకు పెంచాలని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఏర్పడే నాటికి విద్యుత్ సామర్ధ్యం 6574 మెగావాట్లు ఉంటే, ఈ రెండున్నరేళ్లలో అదనంగా 4190 మెగావాట్లు పెరిగింది. ఈ ఏడాది చివరి వరకు మరో 4130 మెగావాట్ల విద్యుత్ అందుతుంది. నిరంతర విద్యుత్‌తో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వచ్చే వేసవిలో 10 వేల మెగావాట్లకు డిమాండ్ చేరుకున్నా, సమర్ధంగా సరఫరా చేస్తామన్నారు. కెటిపిఎస్‌లో 800 మెగావాట్లు, చత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్లు, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నుంచి 1080 మెగావాట్లు, ఎన్‌టిపిసి ద్వారా 4వేల మెగావాట్లు, సిజిఎస్ ద్వారా 809 మెగావాట్లు, సోలార్ ద్వారా 3727 మెగావాట్లు, 90 మెగావాట్లు జల విద్యుత్ ద్వారా అందుబాటులోకి రానుంది. వార్ధా-డిచ్‌పల్లి లైను నిర్మాణం పూర్తికావడం వల్ల ఉత్తరాది గ్రిడ్ నుంచి రెండు వేల మెగావాట్లు వస్తుంది. లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ దిశగా రాష్ట్రప్రభుత్వం పయనిస్తోందన్నారు. విద్యుత్ డిస్కాంలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు ఆ సంస్థల మొత్తం రూ.11,897 కోట్ల అప్పులో 75 శాతం అంటే రూ.8923 కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకం కింద రాష్ట్రం స్వీకరించింది.