తెలంగాణ

కొండాపూర్‌లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, మార్చి 13: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొండాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణంలో భాగంగా సెల్లార్ కోసం గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తు మట్టిపెళ్లలు పడి ఇద్దరు మహిళా కూలీలు సజీవ సమాధి అయ్యారు. ఇటీవల నానక్‌రాంగూడలో భవనం కూలి పదకొండు మంది మృతి చెందిన విషయాన్ని మరువకముందే తాజా సంఘటన ఈ ప్రాంతంలో విషాదం నింపింది. గూగుల్ కార్యాలయానికి సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మృతులను భారతవ్వ (35), కిష్టవ్వ (25)గా పోలీసులు గుర్తించారు. కొండాపూర్‌లో ఓ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఓ నిర్మాణ సంస్థ సూమారు 30 అడుగు సెల్లార్ గుంతను తవ్వింది. సంగారెడ్డి జిల్లా బిపేటకు చెందిన పాపయ్య, పి.కృష్టమ్మ దంపతులు, కామారెడ్డి జిల్లా పెద్దకొడగంల్‌కు చెందిన హనుమాండ్లు, శాంతమ్మ దంపతులు, అదే గ్రామానికి చెందిన బాలరాజు, భారతమ్మ దంపతులు నిర్మాణ సంస్థలో గత నెల రోజుల నుంచి కూలీలుగా పనిచేస్తూ, మసీదుబండలో నివాసముంటున్నారు. రోజూ మాదిరిగానే సోమవారం ఉద యం 9 గంటలకు పనిలోకి దిగిన వీరిపై మట్టి పెళ్లలు పడడంతో సెల్లార్‌లో పనిచేస్తున్న భారతమ్మ, కృష్ణమ్మ వాటి కింద కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందారు. ఈ ప్రమాదంలో కృష్ణమ్మ భర్త పాపయ్యకు, శాంతమ్మ భర్త హనుమాండ్లుకు, బాలరాజుతో పాటు అతని భార్య శాంతమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు అసుపత్రికి తరలించారు. మృతదేహలను జెసిబితో సహయంతో వెలికి తీశారు. విషయం తెలుసుకున్న నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డి సహయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు కార్మిక శాఖ నుంచి రూ.6 లక్షలు జిహెచ్‌ఎంసి నుండి రూ.2 లక్షలు చొప్పున నష్టపరిహరం చెల్లించనున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ నాయకుల ఆందోళన
ఇదిలావుంటే, ఈ ఘటనపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షలు నష్టపరిహరం చెల్లించాలని తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శ మారబోయిన రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. దీంతో అధికారులు మారోమారు చర్చించుకుని బిల్డర్‌తో మాట్లాడి మృతుల కుటుంబాలకు చెరో రూ.10 లక్షలు కార్మిక శాఖ నుండి రూ.6 లక్షలు, జిహెచ్‌ఎంసి నుండి రూ.2 లక్షలు చొప్పున మొత్తం రూ.18 లక్షలు చెల్లించ నున్నట్లు ప్రకటించారు. దీం తో మృతుల కుటుంబీకులు, ఆందోళనకారులు శాంతించారు.
క్రిమినల్ కేసు పెడతాం: మేయర్
కొండాపూర్ నిర్మించతలపెట్టిన బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి పాటి మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి అనుమతి తీసుకున్నారని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అయితే భవనం నిర్మించే ముందు సాయిల్ టెస్టు చేయించుకుని అనంతరం పనులు చేపట్టాల్సి ఉండగా.. అలా చేయలేదని స్పష్టమవుతోందన్నారు. భవన నిర్మాణంలో బిల్డర్ నిర్లలక్ష్యం స్పష్టంగా కనబడుతోందని, ప్రమాదంపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని, బిల్డర్, ఇంజనీర్‌పై క్రిమినల్ కేసు పెడాతామని మేయర్ తెలిపారు.
ప్రమాదానికి కారణమిదే..
సెల్లార్ కోసం తీసిన గుంతపై టన్నుల కొద్ది ఐరన్‌ని డంప్ చేశారు. దీకితోడు సెల్లార్‌పైన గల రోడ్డుపై వాహనాలు తిరగడంతో వాటి వైబ్రెషన్స్‌కి మట్టిపెళ్లలు విరిగిపడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నిర్మాణ సంస్థ మూడు సెల్లార్ల కోసం గుంత తీసినప్పుడు కనీసం 5 మీటర్లు సెట్ బ్యాక్ పాటించాలి. అయితే ఈ నిబంధనను బిల్డర్ పాటించలేదు. దీకితోడు కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్న స్థలంలో గతంలో చెరువు ఉండేదని, ఈప్రమాదానికి అదికూడా ఒక కారణమై ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. మాదాపూర్ డిసిపి విశ్వప్రసాద్ మాట్లాడుతూ, ప్రమాద ఘటన సమాచారం తెలిసిన వెంటనే తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించి మృతదేహలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం అసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని ఆయన తెలిపారు.

చిత్రాలు..శేరిలింగంపల్లి కొండాపూర్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ కోసం తవ్విన సెల్లార్ మట్టిచరియలు విరిగిపడిన ప్రదేశం, రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు