తెలంగాణ

చెత్తబుట్టలో వెయ్యదగిన నోట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతను కాంగ్రెస్ మరోసారి బయటపెట్టుకుందని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మీడియా పాయింట్‌లో మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలతో ఉందంటూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు ఇచ్చిన 40 పేజీల నోట్ చెత్తబుట్టలో వెయ్యదగిందని మంత్రి అన్నారు. 40 పేజీల్లో ఒక్క పేజీ కూడా పనికిరాదని, ఒక్క వాఖ్యం కూడా వాస్తవం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దిగజారుడు, దివాళా కోరు రాజకీయాలకు, అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజలను తప్పు దోవ పట్టించే చర్య అని విమర్శించారు. దేశ జిఎస్‌డిపి వృద్ధి కన్నా తెలంగాణ ఎక్కువ సాధించిందని చెప్పారు. గవర్నర్ తన ప్రసంగంలో ఎక్కడా తప్పు చెప్పలేదని అన్నారు. టిర్‌ఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు పెరిగిన అంశాన్ని, పారదర్శక, సుపరిపాలన గురించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని హరీశ్‌రావు తెలిపారు. కానీ పెట్టుబడుల్లో తెలంగాణ నంబర్ వన్ అని గవర్నర్ చెప్పినట్టుగా కాం గ్రెస్ పార్టీ మాట్లడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యుత్ కొరతలు లేని రాష్ట్రంగా రికార్డు సృష్టించిందని అన్నారు. తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని, కాంగ్రెస్ హయాంలో ఆరు గంటల పాటు కూడా విద్యుత్ ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ పాలిత కర్నాటక రాష్ట్రంలో విద్యుత్ కొరతపై తెలంగాణ నాయకులు సమాధానం చెప్పాలని అన్నారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్ కార్డుల ద్వారా ఇప్పటి వరకు లక్షా ఆరువేల మందికి వైద్య సేవలు అందాయని చెప్పారు. రెండు వేల మందికి హెల్త్ కార్డులపై సర్జరీలు కూడా చేయించినట్టు తెలిపారు. హెల్త్ కార్డు ద్వారా ఒక్కరి కి కూడా వైద్య సేవలు అందలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్న దానిలో వాస్తవం లేదని అన్నారు. ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినట్టు చెప్పా రు. మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించామని, కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిద్దామని అన్నారు. వాస్తవాలను కాంగ్రెస్ నాయకు లు ఎందుకు వక్రీకరిస్తున్నారో చెప్పాలని అన్నారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతన్న హరీశ్‌రావు