తెలంగాణ

వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణలో 2017 వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉందని అందువల్ల హీట్‌వేవ్ యాక్షన్‌ప్లాన్‌ను జిల్లాకలెక్టర్లు అమలు చేయాలని ప్రభుత్వం హెచ్చరించింది. జిల్లా కలెక్టర్లతో బుధవారం జరిగిన వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిఆర్ మీనా మాట్లాడారు. వేడి గాలులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల తాగునీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని, ఎండల నుండి కాపాడుకునేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించి నివేదికలను పంపించాలని కలెక్టర్లకు వారు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటికి ఇబ్బంది ఉన్న ప్రాంతాల గురించి తెలియచేస్తే ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చన్నారు. 2015-16 లో తాగునీటికి 317 కోట్ల రూపాయలు కేటాయించామని, ఇప్పుడు కూడా అవసరాన్నిబట్టి నిధులు కేటాయిస్తామన్నారు. మిషన్ భగీరథ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.