తెలంగాణ

బడ్జెట్‌లో బిసిలకు ప్రాధాన్యం ఏది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బిసిలకు న్యాయం జరగలేదని బిసి సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బిసిలకు నాలుగు శాతం నిధులు కేటాయించి ఇది బిసి బడ్జెట్ అని ఎలా అంటారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిసి స్టడీ సర్కిల్‌కు గత ఏడాది 25 కోట్లు కేటాయించి, ఈ ఏడాది 14 కోట్లు తగ్గించారని ఆయన ఉదహరించారు. బడ్జెట్‌లో బిసిల విద్యకు, వృత్తులకు సరైన ప్రాథాన్యం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో బిసిల సంక్షేమానికి 5 వేల కోట్లు, బిసి కార్పోరేషన్‌కు వెయ్యి కోట్లు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.