తెలంగాణ

విద్యారంగాన్ని విస్మరించిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి సరిపడా కేటాయింపులు చేయలేదని పేర్కొంటూ ఎబివిపి నేతలు మంగళవారం నాడు ఉస్మానియా యూనివర్శిటీలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప మాట్లాడుతూ 1,49,646 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి ఇచ్చింది పూజ్యమని, ఆ నిధులు సిబ్బంది జీత భత్యాలకే సరిపోతాయని, విద్యార్థుల అవసరాలు కలగానే మిగిలిపోతోందని ఆరోపిచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 5600 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం 1939 కోట్లు కేటాయించిందని, అలాగే ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలకు కేవలం 200 కోట్లు కేటాయించడం అంటే చిన్నచూపు చూడటమేనని, కనీసం వెయ్యి కోట్లు కేటాయించాలని అన్నారు. అలాగే కెజి టు పీజీ విద్యావిధానానికి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం కూడా తీవ్ర నిరాశకు గురిచేస్తోందని పేర్కొన్నారు.