తెలంగాణ

అప్పుల ఊబిలోకి తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీతో అప్పు చేసి పప్పుకూడు అన్న చందంగా ఉందని అన్ని వర్గాల ప్రజలను నిరాశకు గురిచేసిందని బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ నిశితంగా విమర్శించారు. పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ , బిసి మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించామని చెబుతూ వారి అభివృద్ధికన్నా, వారి ఓట్లు పొందడానికే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఇది మోసపూరిత బడ్జెట్, ఓట్లు పొందేందుకు ప్రవేశపెట్టింది మాత్రమేనని అన్నారు. ఏ వర్గాలూ మోసపోవడానికి సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవడం, స్వయం పాలన అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ఉద్యోగాలు కల్పించడం మాని, ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. 60 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలూ కలిపి 70వేల కోట్లు అప్పు చేస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత మూడేళ్లలో 70వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని, ఇది బంగారు తెలంగాణ కాదని పేర్కొన్నారు. రెండు పడకల ఇళ్లు, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి కేటాయింపులకు నిధులు లేవని, విద్యార్థుల ఫీజు బకాయిలు 3391 కోట్లు చెల్లించాల్సి ఉండగా 1900 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు. ఉన్నత విద్య అవకాశాలు విద్యార్ధులకు లేకుండా చేస్తున్నారని మూడేళ్లలో 1400 ఇళ్లు కడితే రెండున్నర లక్షల ఇళ్లు కట్టడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలని అన్నారు. బిసిలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి, జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించాలని, రాజ్యాంగ విరుద్ధంగా మైనార్టీల రిజర్వేషన్ల పెంపుదల విషయం మాట్లాడుతున్న ప్రభుత్వం, రాజకీయాల్లో బిసిల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లుపెంచే విషయంపై ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బిసిలను ఓటు బ్యాంకుగా చూసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందని, బిసిలు వీరి మోసపూరిత చర్యలు గమనిస్తున్నారని అన్నారు.