తెలంగాణ

అంకెల గారడీతో కెసిఆర్ సర్కార్ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: రాష్ట్రం అందించే లెక్కల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జిడిపి నిర్ణయిస్తుందని, కేంద్రానికి తప్పుడు లెక్కలను ప్రభుత్వం అందించడం వల్లే అధిక జిడిపి నమోదైనట్లు కనిపిస్తోందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.
కేవలం అంకెల గారడీతో ప్రజలను కెసిఆర్ సర్కార్ మోసం చేస్తోందని అన్నారు. మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జిడిపి ఎవరు నిర్ణయిస్తారో మంత్రి హరీశ్ రావుకు తెలియకపోవడం శోచనీయమని అన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ ఉత్పత్తులు పడిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సామాజిక ఆర్థిక సర్వే చెబుతున్న లెక్కలు తప్పా అని నిలదీశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై సర్కార్ చెబుతున్న గొప్పలన్నీ అవాస్తవాలేనని అన్నారు. కెసిఆర్ హయాంలో ఒక్క విద్యుత్ ప్లాంటు కూడా ఇంకా ఉత్పత్తి ప్రారంభించలేదని తెలిపారు. కల్వకుర్తి ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి చేయకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. ఈ ఏడాది మార్చి 8 వరకు రాష్ట్రంలో 2722 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, కెసిఆర్ వ్యవసాయానికి బడ్జెట్ తగ్గించడం దారుణమని అన్నారు. కమిషన్లు వచ్చే పనులకే అధిక కేటాయింపులు జరిపారని ఆరోపించారు. తెరాస మ్యానిఫెస్టో ఓ అబద్దాల పుస్తకమని, ప్రతిసారి ప్రజలను మోసం చేయలేరని అన్నారు. రాష్ట్రాన్ని లిక్కర్‌లో, పార్టీ ఫిరాయింపుల్లో మాత్రం కెసిఆర్ నెంబర్ వన్ చేశారని ఎద్దేవా చేశారు. కెటిఆర్ ఓ బచ్చా, రాహుల్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.
ముందస్తు ఎన్నికలు
ఎదుర్కొనేందుకు సిద్ధం
* సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్
తమ పార్టీ ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు. మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఓట్ల కోసమే కెసిఆర్ బడ్జెట్ రూపొందించారని అన్నారు. ఇది ఎన్నికల బడ్జెట్‌గా ఆయన అభివర్ణిస్తూ, వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ ఉండదన్న సంగతి గ్రహించాలని అన్నారు. బర్రెలు, గొర్రెలు కాసుకోవడానికి బిసిలు సిద్ధంగా లేరని అన్నారు. బిసిల పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలనుకుంటున్నారని అన్నారు. మహిళలు ధైర్యంగా ఉండాలంటున్న ఎంపి కె.కవిత ముందు కెసిఆర్ మంత్రివర్గంలో మహిళలను ఎందుకు తీసుకోలేదో అడగాలని అన్నారు.
కల్వకుర్తి
ఎత్తిపోతలకు నిధులేవి..?
2017 ఖరీఫ్ నాటికి కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేస్తామంటూ చెబుతున్న కెసిఆర్, మరీ ఈ బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు ఎందుకు కేటాయించలేదని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుపై కెసిఆర్‌కు చిత్త శుద్ది లేదని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే 1772 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేయాల్సిందని, కేవలం 1000 కోట్లే కేటాయించారని అన్నారు.