తెలంగాణ

సామాజిక న్యాయంతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, మార్చి 14: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులకు ఎక్కువగాను, ఖర్చులకు తక్కువగాను ఉందని, దీనిని ఈనెల 19వ తేదీలోపు జనాభా ప్రకారం సవరణలతో కేటాయించకపోతే ప్రభుత్వంపై యుద్ధం తప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం కోసం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం నల్లగొండ జిల్లా వలిగొండ మండలంలోని వర్కట్‌పల్లి, గోకారం, లింగరాజుపల్లి గ్రామాల మీదుగా మధ్యాహ్నం వలిగొండకు చేరుకుంది. పాదయాత్రకు కాంగ్రెస్, సిపిఐ, బిసి సంక్షేమ సంఘం నాయకులు మద్దతు పలికారు. మండల కేంద్రంలో పాదయాత్రకు జనం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడుతూ సామాజిక న్యాయంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. పాదయాత్రలో ఇప్పటికే దాదాపు 85 వేల దరఖాస్తులు ప్రజలు వివిధ సమస్యలపై అందించారని, జనంలో అసంతృప్తి పెరిగిపోయిందన్నారు. రాజకీయ అవసరాల కోసమే జిల్లాల సంఖ్యను పెంచారన్నారు. తెలంగాణ రాకముందు పరిస్థితి ఏలా ఉండేదో తెలంగాణ వచ్చాక కూడా పరిస్థితి అదేవిధంగా ఉందని నిరుద్యోగులు ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈనెల 19న నిర్వహించే బహిరంగ సభ అనంతరం కూడా సిపిఎం సామాజిక సమరం కొనసాగిస్తుందన్నారు. సిపిఎం బహిరంగ సభ రాజకీయ ముఖచిత్రానికి వేదిక అవుతుందన్నారు. తెలంగాణలో కమ్యూనిస్టులకు పూర్వవైభవం వచ్చేందుకు ఎన్నో రోజులు లేవన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిపిన పులిగిల్ల గ్రామానికి చేరుకున్న పాదయాత్రకు 4 వేల కిలోమీటర్లు పూర్తయన సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ పాదయాత్రలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, సిపిఐ జిల్లా నాయకులు యానాల దామోదర్‌రెడ్డి, జాన్‌వెస్లీ, రమ, రమణ, ఆశయ్య, అమ్బాస్, శోభన్, నైతం రాజు, జిల్లా కార్యదర్శి జహాంగీర్, తిరందాస్ గోపి, గోపాల్, నర్సింహ్మా, భూపాల్‌రెడ్డి, వేముల మహేందర్, బోడ సుదర్శన్, మద్దెల రాజయ్య, సుర్కంటి వెంకట్‌రెడ్డి, సిర్పంగి స్వామి, పల్సం రమేశ్, తుర్కపల్లి సురేందర్, కూర శ్రీనివాస్, నాయకులు పాశం సత్తిరెడ్డి, బత్తిని సహదేవ్, కాసుల వెంకటేశం, కొండూరు సాయి, సాయిని యాదగిరి, రాగీరు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.