తెలంగాణ

గంట ముందే కేంద్రాలకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపటి నుండి టెన్త్ పరీక్షలు అంతర్జాలంలో హాల్‌టిక్కెట్లు
5.38 లక్షల మంది విద్యార్థులు 2411 కేంద్రాలు

హైదరాబాద్, మార్చి 15: టెన్త్ పరీక్షలు 17 నుండి ప్రారంభమవుతున్నాయ. 5,38,226 మంది రెగ్యులర్, 28,395 మంది గత పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు హాజరుకానున్నారు. 2411 రెగ్యులర్, 145 ప్రైవేటు సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఈ నెల 30 వరకూ జరగనున్నాయని పరీక్షల డైరెక్టర్ సురేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి పరీక్షలు 14నే ప్రారంభమైనా తొలి మూడు రోజులు ఒఎస్సెస్సీ పరీక్షలే కావడంతో తక్కువ మంది హాజరవుతున్నారు. పరీక్ష ఉదయ 9.30 నుండి 12.15 వరకూ జరుగుతుందని, విద్యార్థులు మాత్రం 8.30కే కేంద్రాలకు చేరుకోవాలని, 8.45కు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని సురేందర్ రెడ్డి చెప్పారు. పరీక్షల నిర్వహణా సమయంలో విద్యార్ధులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నియంత్రించేందుకు పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రం మొత్తం మీద 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాల వారీ ప్రత్యేక పరిశీలకులను నియమించామని, వీరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా ఉన్నతాధికారులతో సమన్వయం చేస్తారని పేర్కొన్నారు. హాల్‌టిక్కెట్లు లేని వారు బిఎస్‌ఇ తెలంగాణ డాట్ ఆర్గ్ అనే వెబ్‌సైట్‌కు వెళ్లి డౌన్ లోడ్ చేసుకుని హెడ్మాస్టర్‌తో సంతకం చేయించుకుని పరీక్షకు హాజరుకావచ్చని అన్నారు. అపోహలు పట్టించుకోవద్దని, పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను తాము మూయిస్తున్నామని, 144 సెక్షన్ విధిస్తున్నామని అన్నారు. పరీక్షల నిర్వాహకులు, అభ్యర్ధులు మినహా ఎవరినీ కేంద్రాల వద్దకు అనుమతించబోమని చెప్పారు. ముందు రోజే పరీక్ష కేంద్రాలను గుర్తించి సందర్శించాలని అపుడే పరీక్షకు సకాలంలో చేరుకోగలుగుతారని అధికారులు పేర్కొన్నారు. తాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరా సక్రమంగా చూస్తామని, ప్రధమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.