తెలంగాణ

సస్పెన్షన్ ఉపసంహరణపై వెనక్కి తగ్గిన సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: అసెంబ్లీ నుంచి టిడిపి ఎమ్మెల్యేలు ఎ. రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసింది. ఈ నెల 10న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆటంకపరిచారన్న కారణంగా వారిరువురినీ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 11న రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీశ్ రావు సభలో వారిరువురి సస్పెన్షన్‌కు తీర్మానం ప్రతిపాదించగా, పాలకపక్ష సభ్యులు ఆమోదించారు. దీంతో స్పీకర్ మధసూదనా చారి వారిని సభ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో, రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళిపోయారు. ఆ రోజున సండ్ర సభకు హాజరుకాలేదు. కాగా ప్రభుత్వ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్, బిజెపి, సిపిఎం సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు. నాలుగు రోజులు గడిచింది, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సభలో బడ్జెట్ ప్రతిపాదించారు కాబట్టి బడ్జెట్‌పై జరిగే చర్చలో పాల్గొనేలా వారి సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా ప్రభుత్వాన్ని కోరాలనుకుంది. ఇలాఉండగా తమ సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో, వారు కోర్టులోనే తేల్చుకోనివ్వండని ప్రభుత్వం తన ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలిసింది.