తెలంగాణ

వడగళ్ల వాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 15: నిజామాబాద్ జిల్లాలో బుధవారం సునామీని తలపించే సుడిగాలి బీభత్సం సృష్టించింది. సుడిగాలి ధాటికి పెద్ద పెద్ద చెట్లు విరిగి పడ్డాయి. పెంకుటిళ్ల పెంకులు అరకిలోమీటరు దూరం వరకు ఎగిరిపడ్డాయి. రేకులతో నిర్మించుకున్న ఇండ్లు, పూరి గుడిసెలు నామరూపాలు లేకుండా మొండి గోడలతో మిగిలాయి. దాదాపు అరగంట పాటు భారీ సైజులో వడగండ్లతో భీకర శబ్దాలు చేస్తూ కురిసిన వడగళ్ల వానకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఊహించని రీతిలో ఒక్కసారిగా ఏర్పడిన ఈ ప్రకృతి బీభత్సానికి వరి, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంటలు నేలవాలి పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎక్కువగా నవీపేట, మాక్లూర్ మండలాల్లో ప్రకృతి ప్రకోపం అపార నష్టాన్ని మిగిల్చింది. వందేళ్లకు పైబడిన భారీ వృక్షాలు సైతం ఈదురుగాలుల ధాటికి కూకటివేళ్లతో పెకిలించుకుపోయాయి. అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపడ్డాయి. నవీపేట మండల కేంద్రంతో పాటు బినోల, నిజాంపూర్, నాళేశ్వర్, తుంగిని, సిర్నాపల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం అన్నదాతను కంటతడి పెట్టించింది. నవీపేట - జనె్నపల్లి మార్గంలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోదావరి తీరంలోనే కాకుండా ఆయా గ్రామ శివార్లలో వందలాది ఎకరాల్లో వేసిన పంటలన్నీ పూర్తిగా నేలవాలాయి. మాక్లూర్ మండల కేంద్రంతో పాటు వల్బాపూర్, చిక్లి, గుంజిలి, బొంకన్‌పల్లి, కొత్తపల్లి, గొట్టిముక్కల, మాందాపూర్, ధర్మారం గ్రామాలను గాలివాన అతలాకుతలం చేసింది. ఎన్నడూ చూడని విధంగా భారీ సైజులో వడగండ్లతో కూడిన వర్షం అరగంట పాటు ఏకధాటిగాకురవడంతో పెంకుటిళ్లు, రేకుల షెడ్లపైన, పంట పొలాల్లో వడగండ్లు కుప్పలు, కుప్పలుగా కనిపించాయి. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటలన్నీ గాలివాన బీభత్సంతో నేలవాలడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మామిడి తోటల రైతులు మరింత పెద్దఎత్తున నష్టపోవాల్సి వచ్చింది. విపరీతమైన వేగంతో వీచిన గాలుల ధాటికి మామి డి పిందెలు, కాయలన్నీ ఎక్కడికక్కడ రాలిపడ్డా యి. గాలివాన ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యుత్ సరఫరా నిలిచిపోగా, పలుచోట్ల కరెంటు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా కూలిపోయాయి.