తెలంగాణ

ఐటిడిఎలకు ఐఎఎస్‌లు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16:ఐటిడిఎలకు ఐఎఎస్‌లను నియమించాలని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్‌పై గురువారం శాసన సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఐటిడిఎలకు ఐఎఎస్‌లు ఉండేవారని, వారిని కలెక్టర్లుగా నియమించిన తరువాత ఐటిడిఎల పాలన గాలికి వదిలేశారని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, సమర్ధంగా పనిచేసే ఐఎఎస్‌లను నియమించాలని కోరారు. బడ్జెట్ అంటే బడుగు జీవులు తమకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండేదని కానీ ఈ బడ్జెట్ బడుగులకే పెద్ద పీట వేసిందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు.
శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు రూపాయి రాక రూపాయి పోక అంటూ రెండు చక్రాలు వేసేవారిని ఆ చక్రాల్లో బడుగు జీవులకు స్థానమే ఉండేది కాదని అన్నారు. కానీ ఇప్పుడు కుల వృత్తులకు పెద్ద పీట వేస్తూ, కుల వృత్తులపై జీవించే వారు సగర్వంగా తలెత్తుకునే విధంగా బడ్జెట్ ఉందని ప్రభాకర్ తెలిపారు.
మత్స్యకారులకు చేపలు, గొర్రెల పెంపకం పై ఆధారపడి జీవించే వారికి 75శాతం సబ్సిడీతో గొర్రెలు అందజేయాలని నిర్ణయించడం విప్లవాత్మకమైన నిర్ణయం అని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలను మార్చే విధంగా బడ్జెట్ ఉందని అన్నారు.