తెలంగాణ

హస్తకళలకు పూర్వ వైభవం తెస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ముషీరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్రంలో అంతరిస్తున్న హస్తకళలకు పూర్వవైభవం తెస్తానని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంతోష్‌కుమార్ గుప్తా హామీనిచ్చారు. ఆర్టీసి క్రాస్‌రోడ్‌లోని హస్తకళాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆయన సంస్థ చైర్మన్‌గా లాంఛనంగా భాద్యతలు స్వీకరించారు. తెలంగాణ హస్తకళలలను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెస్తానన్నారు. ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వం గుర్తించి ప్రత్యేకంగా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, గణేష్‌గుప్త, కొండా సురేఖ, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్ధ చైర్మన్ వి.ప్రకాశ్‌రావు ముఖ్యఅతిధులుగా హాజరై చైర్మన్ సంతోష్ కుమార్ గుప్తాను అభినందించి ప్రసంగించారు.