తెలంగాణ

కుంభకోణాల కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై గురువారం శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. గవర్నర్ చేసిన ప్రసంగంపై చైర్మన్ స్వామిగౌడ్ సభ్యులను చర్చకు అనుమతించారు. బడ్జెట్‌కు అనుకూలంగా అధికార పార్టీ సభ్యులు, ప్రతికూలంగా మండలి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ, ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన సభ్యులు పురాణం సతీష్ మాట్లాడుతూ అరవై ఏళ్ల కాంగ్రెస్, టిడిపిల పాపం వల్లే తెలంగాణ అన్ని రంగాల్లో ధ్వంసమైందని, అయినా ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా నడిపించేలా ఉందని వ్యాఖ్యానించారు.
గత పాలకులంటూ పలు సార్లు వ్యాఖ్యానించటంతో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ నాలుగోదని, ఇంకా గత పాలకులని వ్యాఖ్యానిస్తున్నారంటే గత పాలకులు టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.
కాంగ్రెస్ హయంలో ఏ ప్రాజెక్టును ప్రారంభించాలన్నా, ఆ పార్టీ నేతలు కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకునేందుకే పరిమితమయ్యారంటూ టిఆర్‌ఎస్ సభ్యులు ఆరోపించగా ఆరోపణలు రుజువు చేయాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఫండ్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తామని హామీ ఇచ్చిన సిఎం మాట తప్పారన్నారు. దీంతో కాసేపు ఇరుపార్టీల మధ్య వాదనలు చోటుచేసుకున్నాయి. వ్యవసాయం, నీటిపారుదలను నిర్లక్ష్యం చేసినందుకే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారని అధికారపార్టీ సభ్యులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయంలోనే నీటి పారుదల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని ఆ పార్టీ సభ్యులు వాదించారు. హోం మంత్రి నాయిని ఒక్కసారిగా జోక్యం చేసుకుని కుంభకోణాలు జరిగింది కాంగ్రెస్ హయాంలోనే మా హయాంలో కాదంటూ, ఇందుకు విచారణ చేస్తాం, మీరు సిద్ధమేనా? అని వ్యాఖ్యానించగా, చైర్మన్ జోక్యం చేసుకుని అవకాశమిచ్చిన సభ్యులు మాత్రమే మాట్లాడాలని, మిగిలిన వారు జోక్యం చేసుకోవద్దని సూచించారు.