తెలంగాణ

సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మీ ప్రసంగాన్ని అడ్డుకున్నారంటూ ఏక పక్షంగా, రాజ్యాంగ విరుద్దంగా తమ పార్టీ శాసనసభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారని గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఫిర్యాదు చేశారు. సస్పెన్షన్‌కు ముందు తమ సభ్యుల నుంచి వివరణ తీసుకోవడం గానీ, ఇతర పక్షాలతో చర్చించడం గానీ చేయకుండా ఏకపక్షంగా సభ జరిగినన్ని రోజులు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారని వారు ఆ ఫిర్యాదులో వివరించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తమ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

చిత్రం..గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న టిటిడిపి నేతలు రేవంత్‌రెడ్డి, రమణ తదితరులు