తెలంగాణ

అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు కాకుండా కొత్త కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల వ్యవధి సందర్భంగా పాలకపక్ష సభ్యులు చింత ప్రభాకర్, బోడిగ శోభ, బానోత్ శంకర్ నాయక్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీలు కాకుండా కొత్త వాటిని ఏర్పాటు చేయడం లేదన్నారు. అయితే ఖాళీగా 1360 అంగన్‌వాడీ టీచర్, 3109 అంగన్‌వాడీ వర్కర్స్, 1500 మిని అంగన్‌వాడీ వర్కర్స్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సూపర్‌వేజర్ పోస్టుల భర్తీలో అంగన్‌వాడీ టీచర్లకు సీనియార్టీ ప్రకారం అవకాశం కల్పించబోతున్నట్టు మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 35 వేల 715 అంగన్‌వాడీ కేంద్రాలు, 3950 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 3900 అంగన్‌వాడీలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు పాఠశాల భవనాలు అనుకూలంగా ఉండటంతో 7348 కేంద్రాలు పాఠశాలల్లో కొనసాగుతున్నాయని, 2878 భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు, వర్కర్లకు ఇటీవల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.7 వేల నుంచి రూ.10,500, సహాయకుల వేతనాన్ని రూ.4500 నుంచి రూ. 6000, వర్కర్ల వేతనాన్ని రూ.4500 నుంచి రూ.6000కు పెంచామన్నారు.