తెలంగాణ

బిసి సబ్‌ప్లాన్ తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 18: వెనుకబడిన తరగతుల సంక్షేమం పట్ల కెసిఆర్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే బిసి సబ్‌ప్లాన్‌ను తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బిసిల సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని, రాష్ట్రంలోని 112 కులాలకు చెందిన బిసిలను కెసిఆర్ సర్కారు వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు. గత మూడు సంవత్సరాల్లో బిసిలకు కెసిఆర్ ఒరగబెట్టింది ఏమీ లేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీ సక్రమంగా జరగకపోవడంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. నాగార్జున సాగర్ నుండి రైతులకు ఏప్రిల్ వరకు నీళ్లు ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో పాలమూరు, నల్లగొండ జిల్లాలకు నష్టం జరుగుతుందని, థర్మల్ విద్యుత్ వలన భవిష్యత్‌లో రైతులపై పెను భారం పడనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి : కృష్ణయ్య
రాష్ట్రంలో వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజులు ప్రపంచంలో ఎక్కడాలేవని, ప్రజలను దోచుకునేందుకే పాలకులు ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిపై మంత్రి వర్గ ఉప సంఘం అధ్యయనం జరిపి అధిక ఫీజులను నియంత్రించేందుకు చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.